దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో కూడా తమన్నా భాటియా సత్తా చాటుతుంది. తాజాగా ఆమె ఒక బయోపిక్‌లో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈమేరకు ఒక పోస్టర్‌ను షేర్ చేశారు. ప్రముఖ దర్శక–నిర్మాత, నటుడు, స్క్రీన్ రైటర్, ఎడిటర్ వి.శాంతా రామ్ జీవితం వెండితెరపైకి రానున్న విషయం తెలిసిందే. ‘వి.శాంతారామ్: ది రెబల్ ఆఫ్ ఇండియన్ సినిమా’ టైటిల్‌తో ఈ బయోపిక్ రానుంది. సిద్ధాంత్ చతుర్వేది ఆయన పాత్రలో నటించనున్నారు. ఈ బయోపిక్‌లో తమన్నా భాగమైంది.

అభిజీత్ శిరీష్ దేశ్‌పాండే దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను రాహుల్ కిరణ్ శాంతారామ్, సుభాష్ కాలే, సరితా అశ్విన్ వర్దే నిర్మించనున్నారు. వి.శాంతారామ్ సతీమణి జయశ్రీ పాత్రలో తమన్నా కనిపించనున్నారు. 1921లో నటుడిగా చిత్రరంగప్రవేశం చేసిన శాంతారామ్ మూకీ, టాకీలు అన్నీ కలిపి 25 చిత్రాల్లో నటించగా.. సుమారు 90 సినిమాలు నిర్మించారు. చిత్రపరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ, 1985 లో కేంద్ర ప్రభుత్వం ‘దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంను బహూకరించింది. ఆయన అక్టోబరు 18, 1990 వ సంవత్సరంలో మరణించారు.
The star of an era ✨
The strength behind a legacy 🎞️
A chapter returning to history. 🌟@SiddyChats #SubhashKale @unbollywood @rajkamalent @SaritaTanwar #VShantaram #TheRebelOfIndianCinema pic.twitter.com/YtEdBiSAGr— Tamannaah Bhatia (@tamannaahspeaks) December 9, 2025


