కుబేరా, ఇడ్లీకడై, ఇష్క్ తేరే మే వంటి విజయవంతమైన చిత్రాల తరువాత ధనుష్ నటిస్తున్న తాజా చిత్రానికి పొంగల్ పండగ సందర్భంగా టైటిల్ వెల్లడించారు. ఈయన నటిస్తున్న 54వ చిత్రం ఇది. దీనికి కర అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. దీనితో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను, ఓ వీడియోను విడుదల చేశారు.
మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్న నటిస్తున్న ఇందులో దర్శకుడు కేఎస్ రవికుమార్, జయరామ్, సురాజ్ వెంజురముడు, కరుణాస్, పృథ్వీ పాండిరాజన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ అధినేత ఐసరి గణేశ్.. థింక్ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేష్ రాజా కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
దీనికి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని, తేనీ ఈశ్వర్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా కర చిత్రంలో ధనుష్ పేరు కరసామి అని వీడియోలో పేర్కొన్నారు. ధనుష్‌ను మాస్ గెటప్‌లో చూపించారు. ఈ మూవీని సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొంది.


