పాటల రచయితపై చెప్పు విసిరిన మహిళ.. వీడియో వైరల్‌ | Woman Throws Shoe At Vairamuthu At Tiruppur Event, Video Goes Viral | Sakshi
Sakshi News home page

పాటల రచయితపై చెప్పు విసిరిన మహిళ.. వీడియో వైరల్‌

Jan 24 2026 2:12 PM | Updated on Jan 24 2026 2:51 PM

Woman Throws Shoe At Vairamuthu At Tiruppur Event, Video Goes Viral

తమిళ సినీ గేయ రచయిత వైరముత్తుపై ఓ మహిళ చెప్పు విసిరిన ఘటన ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.గత బుధవారం తిరుప్పూర్‌లో జరిగిన  కొంగు కళ, సాహిత్య, సంస్కృతి మండలి ప్రారంభోత్సవానికి వైరముత్తుకి ఆహ్వానం అందింది. ఇందులో పాల్గొనేందుకు వైరముత్తు తిరుప్పూర్‌ కలెక్టరేట్‌కు వచ్చినప్పుడు ఎవరో చెప్పు విసిరారు. అయితే ఆ చెప్పు ఆయనపై కాకుండా మరో వ్యక్తిపై పడింది. 

వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. చెప్పు విసిరిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. కోలీవుడ్‌ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. చెప్పు విసిరిన మహిళ పేరు జయ. 45 ఏళ్ల వయసు ఉన్న ఆ మహిళకు మతిస్థిమితం లేదు. కలెక్టర్‌ ఆఫీస్‌తో పాటు కోర్టు దగ్గర కూడా పలుసార్లు ఇలానే చెప్పులు విసిరిందట. ఈ విషయాన్ని పోలీసులు మీడియాకు తెలియజేస్తూ..ఆమెను అరెస్ట్‌ చేసినట్లుగా అధికారికంగా వెల్లడించారు. 

ఈ ఘటన జరిగిన తర్వాత వైరముత్తు తొలిసారిగా సోషల్‌ మీడియాలో చేసిన ఓ పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. తాజాగా ఆయన తిరుప్పూర్‌ లో విక్టోరియస్ తమిళ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ విద్యార్థులతో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేస్తూ.. ‘రెండు వేల మంది యువకులు ఏకగ్రీవంగా చప్పట్లు కొట్టడం చూసి, నన్ను నేను మర్చిపోయాను’ అంటూ రాసుకొచ్చాడు. చెప్పు విసిరిన ఘటనపై ఆయన స్పందించపోవడం గమనార్హం. అయితే ఆమెకు మతి స్థిమితం లేదనే విషయం తెలిసి.. వైరముత్తు  ఆ ఘటనను లైట్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

గత కొంతకాలంగా వైరముత్తు వరుస వివాదాలతో వార్తల్లో ఉంటున్నారు. 2018లో, మీటూ ఉద్యమం సమయంలో, గాయని చిన్మయి శ్రీపాద భువన శేషన్ ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అయితే వైరమత్తు మాత్రం ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement