దర్శకుడు మోహన్.జి ఇంతకుముందు దర్శకత్వం వహించిన చిత్రం ద్రౌపది. ఆ మూవీ విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌గా ద్రౌపది 2 తెరకెక్కుతోంది. రిచర్డ్ రిషి, రక్షణ జంటగా నటించిన ఇందులో నట్టి నటరాజ్, వైజీ.మహేంద్రన్, నాడోడిగళ్ భరణి, శరవణ సుబ్బయ్య, చిరాగ్ జానీ, దివి, దేవయాని శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నేతాజీ ప్రొడక్షన్స్ అధినేత చోళ చక్రవర్తి జిఎం ఫిలింస్ కార్పొరేషన్ సంస్థతో కలిసి నిర్మించారు.
ద్రౌపది 2 విశేషాలు
ఫిలిప్ ఆర్ సుందర్ ఛాయాగ్రహణం, జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంతో పాటు యూ/ఏ సర్టిఫికెట్ పొంది త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. త్వరలోనే ఆడియో లాంచ్ సహా, ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. కాగా 14వ శతాబ్దానికి చెందిన తమిళ చరిత్రలోని ముఖ్యమైన అంశాలతో ద్రౌపది 2ని తెరకెక్కించినట్లు దర్శకుడు పేర్కొన్నారు.
ఇందులో ముగ్గురు ప్రతినాయకులు నటిస్తున్నారని.. అందులో ప్రధానంగా నటుడు చిరాగ్ జానీ నటిస్తున్నట్లు తెలిపారు. ఈయన మహమ్మద్ బిన్ తుగ్లక్ పాత్ర పోషించారని వెల్లడించారు. అతి తెలివి కలిగిన తుగ్లక్ పాత్ర తెరపై ఆవిష్కరించడం కాస్త కష్టంగా మారిందని, కానీ, చిరాగ్ జానీ సమర్థవంతంగా పాత్రను పోషించారని తెలిపారు. ఈ మేరకు చిరాగ్ జానీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
Terror Wears A Crown 👑
Unveiling the Delhi Sultanate #MohdBinThugluq.. @JaniChiragjani Nailed it.. Roaring as First-Level Antagonist🔥@richardrishi@GhibranVaibodha@Rakshana1826 @natty_nataraj @Nethajifilm1032 @SureshChandraa@AbdulNassarOffl @DoneChannel1 pic.twitter.com/4aFcfLh95E— Mohan G Kshatriyan (@mohandreamer) January 2, 2026


