జ్యోతి పూర్వాజ్, పూర్వాజ్ ప్రధాన పాత్రలు చేసిన సై ఫై థ్రిల్లర్ సినిమా "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఏ నిర్మిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 30న థియేటర్లలో మూవీ రిలీజ్ కానుంది.
ఈ నెల 21న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఓవర్సీస్లోనూ "కిల్లర్" మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది. ఓఎంజి పిక్చర్స్ ఈ సినిమాను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ సంస్థ "కిల్లర్" సినిమాను అమెరికా, యూరప్, కెనడా, అరబ్ దేశాలు, మలేషియా, న్యూజిలాండ్, రష్యా వంటి దేశాల్లో విడుదల చేయనుంది.


