breaking news
Ikkis Movie
-
ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
2026 మొన్నే వచ్చినట్లుంది. కానీ అప్పుడే ఫిబ్రవరి చివరకొచ్చేసింది. ఈ వారం థియేటర్లలోకి శ్రీ విష్ణు నుంచి 'విష్ణు విన్యాసం' అనే కామెడీ సినిమా రానుంది. అలానే కమెడియన్ మహేశ్ విట్టా 'ఉత్తుత్త హీరోలు', 'సన్నాఫ్' చిత్రాలు రిలీజ్ కానున్నాయి. హిందీలో 'ద కేరళ స్టోరీ 2' ఈ వీకెండ్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఓటీటీల్లోనూ చెప్పుకోదగ్గ చిత్రాలే ఉన్నాయండోయ్.(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. 'హాట్‌స్పాట్ 2 మచ్' తెలుగు రివ్యూ)ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే.. నవీన్ చంద్ర 'హనీ', 'అక్యూజ్డ్' అనే డబ్బింగ్ మూవీతో పాటు డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు కనబడుటలేదు, రోస్లిన్ అనే వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితో పాటు పలు ఇంగ్లీష్, హిందీ చిత్రాలు కూడా ఉన్నాయి. అలానే రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఇదే వీకెండ్ రిలీజయ్యే అవకాశముంది. ఇవి కాకుండా ఏమైనా సర్ప్రైజు స్ట్రీమింగ్స్ ఉంటాయేమో చూడాలి. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ వస్తుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకు)నెట్ఫ్లిక్స్అక్యూజ్డ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఫిబ్రవరి 27అమెజాన్ ప్రైమ్ద సీఈఓ క్లబ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 23పాల్ మెక్కర్ట్నే (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 25ద బ్లఫ్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 25ఇక్కీస్ (హిందీ మూవీ) - ఫిబ్రవరి 26హాట్స్టార్ప్యారడైజ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 23వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 26సంగ్ మర్మర్ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 26రోస్లిన్ (తెలుగు సిరీస్) - ఫిబ్రవరి 27బ్లాక్ ఫోన్ 2 (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 28బుగోనియా (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 28జీ5డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనబడుటలేదు (తెలుగు సిరీస్) - ఫిబ్రవరి 27తడయమ్ (తమిళ సిరీస్) - ఫిబ్రవరి 27క్రాంతి జ్యోతి విద్యాలయ్ (మరాఠీ సినిమా) - ఫిబ్రవరి 27అంధా ప్యార్ 2.0 (హిందీ రియాలిటీ షో) - ఫిబ్రవరి 28ఆహాసర్కార్ సీజన్ 6 (తెలుగు రియాలటీ షో) - ఫిబ్రవరి 27సన్ నెక్స్ట్హనీ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 27నీలి హక్కీ (కన్నడ మూవీ) - ఫిబ్రవరి 27ఎమ్ఎక్స్ ప్లేయర్సైకో సయ్యాన్ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 25ఆపిల్ టీవీ ప్లస్మోనార్క్: లెగసీ ఆఫ్ మానస్టర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 27(ఇదీ చదవండి: 'రంగస్థలం' సినిమా.. కనీసం రాష్ట్ర అవార్డ్ కూడా ఇవ్వలేదు) -
ఓటీటీలోకి వచ్చేసిన ధర్మేంద్ర చివరి సినిమా
బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్ర.. మూడు నెలల క్రితం అంటే గతేడాది నవంబరు చివరలో చనిపోయారు. తర్వాత నెలకు ఈయన నటించిన చివరి సినిమా థియేటర్లలోకి వచ్చింది. సర్వత్రా ప్రశంసలు అందుకున్న ఆ మూవీ.. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త నంద హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఇక్కీస్'. న్యూఇయర్ సందర్భంగా జనవరి 01న థియేటర్లలోకి వచ్చింది. హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులోనే ధర్మేంద్ర కీలక పాత్ర పోషించారు. జైదీప్ అహ్లవత్ కూడా మంచి రోల్ చేశాడు. 1971 భారత్-పాక్ యుద్ధంలో అమరుడైన అరుణ్ ఖేత్రపాల్ జీవితం ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. రెండు వారాల తర్వాత ఉచితంగా అందుబాటులోకి రానుంది.'ఇక్కీస్' విషయానికొస్తే.. బ్రిగేడియర్ ఎంఎల్ ఖేత్రపాల్(ధర్మేంద్ర) ఆర్మీ మాజీ ఉద్యోగి. పాకిస్తాన్‌లోని తన ఫ్రెండ్స్‌ని కలిసేందుకు లాహోర్ వెళ్తారు. అక్కడ ఉన్నన్నీ రోజులు ఈయన బాధ్యతని ఆర్మీ మాజీ ఆఫీసర్ నిస్సార్ అహ్మద్(జైదీప్ అహ్లావత్)పై పడుతుంది. పాకిస్తాన్లో తన జ్ఞాపకాలని నెమరవేసుకునేందుకు పలు ప్రాంతాలకు వెళ్లిన ఖేత్రపాల్.. తన కొడుకు అరుణ్ ఖేత్రపాల్ చనిపోయిన ప్రదేశానికి కూడా వెళ్తాడు. ఇంతకీ 1971 భారత్-పాక్ యుద్ధంలో 21 ఏళ్ల సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్(అగస్త్య నంద) చేసిన సాహసమేంటి? యుద్ధభూమిలో అతడికి ఎదురైన సవాళ్లేంటి? అనేదే మిగతా స్టోరీ.


