
మెగాస్టార్ కూతురు సుస్మిత కొణిదెల ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన కిష్కింధపురి ఈవెంట్కు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అమ్మను చూస్తే మీ నాన్నగారికి చిన్నపాటి భయం ఏదైనా ఉందా? అని సుస్మితను అడిగారు. దీనికి సుస్మిత స్పందిస్తూ ఇవాళ జరిగిన విషయాన్ని పంచుకున్నారు.
సుస్మిత మాట్లాడుతూ..'ఇవాళే మనశివశంకర వరప్రసాద్గారు మూవీ సాంగ్ షూట్ చేశాం.. అక్కడికి అమ్మ కూడా రావడంతో నాన్న స్టెప్ అటు ఇటు అయింది. నాన్న సరిగ్గా డాన్స్ చేయలేకపోయారు. అమ్మ సెట్లో అడుగుపెట్టడంతో ఆ ఎఫెక్ట్ నాన్నపై పడిందని' పంచుకుంది. మీకు ఏదంటే భయమని సుస్మితను అడగ్గా..మనకి భయపెట్టడం తప్ప.. భయపడటం ఏమీ ఉండదని సుస్మిత కొణిదెల సమాధానమిచ్చింది. కాగా.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ నటించిన కిష్కింధపురి చిత్రం ఈనెల 12న థియేటర్లలో సందడి చేయనుంది.