
అరుణ్, విజయ్, సురేష్‌బాబు, రామాంజనేయులు, తృప్తి
‘‘భద్రకాళి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా ఎవర్నీ నిరుత్సాహ పరచదని కచ్చితంగా చెప్పగలను’’ అని విజయ్ ఆంటోని చెప్పారు. ‘అరువి’ ఫేమ్ అరుణ్ ప్రభు దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా, తృప్తి రవీంద్ర, రియా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భద్రకాళి’. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోని సమర్పణలో రామాంజనేయులు జవ్వాజీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న రిలీజ్ కానుంది.
ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్ మెంట్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా కలిసి తెలుగులో విడుదల చేస్తున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సురేష్ బాబు మాట్లాడుతూ–‘‘విజయ్‌గారి క్రమశిక్షణే ఆయన్ను గొప్పస్థాయికి తీసుకువెళ్తుంది’’ అన్నారు. ‘‘మంచి పొలిటికల్ థ్రిల్లర్ ఇది’’ అని తెలిపారు అరుణ్ ప్రభు. ‘‘ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది’’ అన్నారు రామాంజనేయులు. ఈ వేడుకలో తృప్తి రవీంద్ర, రియా, రైటర్ భాష్యశ్రీ మాట్లాడారు.