
శ్రీ వెంకటా చలపతి ఫిలింస్ పతాకంపై బి. అరుణ్ కౌశిక్ నిర్మాణంలో, వి. జగన్నాధరావ్ దర్శకత్వంలో తీస్తున్న సినిమా 'తాళికట్టు శుభవేళ'. తిలక్ రాజ్, తుంగ హీరోహీరోయిన్. దేవరాజ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో శనివారం జరిగింది.
ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నటుడు తుమ్మలపల్లి ఆంజనేయులు గుప్త, నటుడు వినోద్ కుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై, వీడియో సాంగ్స్, ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. 'తాళికట్టు శుభవేళ సినిమా పేరు విన్నప్పుడే ఎంతో పాజిటివ్‌గా అనిపించింది. మూవీలో సంగీతం మధురంగా ఉంది. కొత్త తరానికి విలువలు నేర్పే మంచి కుటుంబ కథతో ఈ చిత్రం నిలిచిపోతుందని నమ్ముతున్నాను' అని చెప్పారు.