రైతుల కష్టాల నేపథ్యంతో ‘వీడే మన వారసుడు’ | Veede Mana Vaadu Pre Release Event Highlights | Sakshi
Sakshi News home page

రైతుల కష్టాల నేపథ్యంతో ‘వీడే మన వారసుడు’

Jul 2 2025 3:07 PM | Updated on Jul 2 2025 6:10 PM

Veede Mana Vaadu Pre Release Event Highlights

రమేష్‌ ఉప్పు హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘వీడే మన వారసుడు’. లావణ్యా రెడ్డి, సర్వాణి మోహన్‌  హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 18న రిలీజ్‌ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ–‘‘ఒకప్పుడు సందేశాత్మక చిత్రాలు వచ్చేవి. ఆ తరహాలో ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు.

 ‘‘రైతుల కష్టాలను చక్కగా ఆవిష్కరించిన కుటుంబకథా చిత్రం ఇది’’ అని పేర్కొన్నారు రమేష్‌ ఉప్పు. ఈ కార్యక్రమంలో దర్శకులు సముద్ర, వీఎన్‌ ఆదిత్య, నటుడు–దర్శక–నిర్మాత సాయి వెంకట్, ΄ోలీసాఫీసర్‌ రమావత్‌ తేజ, హీరో కృష్ణ సాయి, కాంగ్రెస్‌ నాయకుడు సురేందర్‌ రెడ్డి  పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement