
విష్ణు మంచు హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’.

ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రీతీ ముకుందన్ హీరోయిన్.. మంచు మోహన్‌బాబు, బ్రహ్మానందం, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, శరత్‌కుమార్, మధుబాల తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో శనివారం నాడు ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మోహన్ బాబు, మంచు విష్ణుతో పాటు ముఖేష్ కుమార్ సింగ్, బ్రహ్మానందం , శరత్ కుమార్ ,మధుబాల, సుద్దాల అశోక్ తేజ, బీవీఎస్ రవి, తోట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

















