
విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న యాక్షన్ మూవీ కింగ్‌డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తోన్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ జూలై 31న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్విహంచారు. యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సారి మనం గట్టిగా కొడుతున్నాం అంటూ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'మరో రెండు రోజుల్లో థియేటర్‌లో కలుస్తాం. ఓవైపు టెన్షన్‌గా.. మరోవైపు హ్యాపీగా ఉంది. ఈ రోజు సినిమా కంటే మీ అందరి గురించి మాట్లాడాలనుకుంటున్నా. మీరు దేవుడిచ్చిన వరం. సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా మీ ప్రేమలో మార్పు ఉండదు. ఈ రోజు దాదాపు 2000 మంది ఫాన్స్‌ను కలిశా. అన్నా ఈసారి మనం కొడుతున్నాం అన్నా.. మనం హిట్ కొడుతున్నాం.. టాప్‌లోకి వెళ్తున్నాం అంటున్నారు. మనం అనే పదం ఓన్ చేసుకుంటేనే వస్తుంది. ఎవరో కుంభమేళాకి వెళ్లి నా పోస్టర్‌తో మునిగి నేను హిట్ కొట్టాలని కోరుకున్నారు. హిట్ కొట్టిన తర్వాత కచ్చితంగా అతన్ని కలుస్తా. ఈ రోజుల్లో ఏ సినిమా హిట్ అవుతుందో లేదో తెలియదు కానీ కానీ.. మీరు గౌరవించే సినిమాలే చేస్తా. వ్యక్తిగతంగా మీ అందరికీ నా వంతుగా ఏదో ఒక మంచి పని చేస్తా. ఈ రెండూ నా బాధ్యతలు' అని ఫ్యాన్స్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు.
Trailer వచ్చాక చాలా మంచి Response వచ్చింది...
వాళ్ళ DP లు చూస్తే... Superstar... Icon Star...Tiger...
మీ అందరినీ నేను కలవకపోవచ్చు కానీ..
మీందరికి ఏదొక Positive Contribution చేసే పోతా..#VijayDeverakonda #Kingdom #KingdomOnJuly31st pic.twitter.com/OAGAgfBUWe— Suresh PRO (@SureshPRO_) July 28, 2025