
‘మొగలిరేకులు’ సీరియల్ ఫేమ్ హీరో ఆర్‌కే సాగర్ హీరోగా నటించిన చిత్రం ‘ది 100’. ఈ చిత్రంలో హీరోయిన్లు మిషా నారంగ్, ధన్య బాలకష్ణ నటించారు. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో రమేశ్ కరుటూరి, వెంకీ పూశడపు, జె. తారక్ రామ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న రిలీజ్ కానుంది.

హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై, బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు.

















