విష్ణు మంచు నటించిన తాజా చిత్రం ‘కన్నప్ప’(kannappa) ప్రీ రిలీజ్ వేడుక గుంటూరులో ఘనంగా జరిగింది. భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.
శివ నామస్మరణతో చాలా విజయవంతంగా కార్యక్రమం జరిగింది. ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్ హీరోయిన్‌గా నటించారు. మోహన్‌బాబు, ఆర్.శరత్‌కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం ఇతర కీలకపాత్రల్లో నటించారు.
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది.
ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ గురించి నటుడు మోహన్‌బాబు పలు వ్యాఖ్యలు చేశారు.
'ప్రభాస్, నేనూ 'బావ.. బావ..' అనుకుంటాం. ఇప్పటికీ నేను తనకు ఫోన్ చేస్తే బావ అంటూనే మాట్లాడుతాను. తనూ అంతే.. అలా చాలా సరదాగా మా ఇద్దరి మధ్య పలకరింపులు ఉంటాయి.
కన్నప్ప సినిమాను థియేటర్స్‌లో చూసి తన బిడ్డ విష్ణును ఆశీర్వదించాలని ఆయన కోరారు.
మంచు విష్ణు మాట్లాడుతూ.. 'కన్నప్ప' సినిమా తీయాలనేది నా కల. ఈ సినిమా కోసం నాకు చాలామంది సహకరించారు.
మా నాన్న నాకు దేవుడు. ఆయన లేకపోతే నేను లేను. ఈ సినిమాలో ఎవరెవరు నటించాలనేది కూడా అంతా శివాజ్ఞ ప్రకారమే జరిగింది.


