98వేలు | - | Sakshi
Sakshi News home page

98వేలు

Feb 8 2026 4:29 AM | Updated on Feb 8 2026 4:29 AM

98వేల

98వేలు

98వేలు మూసివేత నిర్ణయం అన్యాయం 1,447

న్యూస్‌రీల్‌

మూసివేతకు

సిద్ధం చేస్తున్న

పాఠశాలల సంఖ్య

చదువుతున్న

విద్యార్థుల సంఖ్య

జిల్లాలోని మొత్తం ప్రభుత్వ బడులు

ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

సాక్షి, పార్వతీపురం మన్యం: విద్యార్థులు లేరన్న నెపంతో గత విద్యాసంవత్సరం ఆరంభంలోనే చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాల మేరకు పలు పాఠశాలల విలీన ప్రక్రియను జిల్లా విద్యాశాఖ చేపట్టింది. దీనిపై ఆయా పాఠశాలల తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రభుత్వ విద్యాలయాల్లో సంస్కరణల పేరుతో బేసిక్‌, ఫౌండేషన్‌, మోడల్‌ ప్రైమరీ విభాగాలుగా విభజించారు. ఫౌండేషన్‌లో ఒకటి, రెండు తరగతులే ఉంటాయి. ఇక్కడ మూడో తరగతి చదవాల్సిన విద్యార్థులు మరో పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. మోడల్‌ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు వల్ల సమీపంలోని ప్రాథమిక పాఠశాలల్లోని మూడు నుంచి ఐదు తరగతుల విద్యార్థులను అక్కడికి తరలించారు. ప్రస్తుతం ఐదులోపు విద్యార్థులున్న ఫౌండేషన్‌ పాఠశాలలనూ.. 1–5 తరగతులుండే బేసిక్‌ స్కూళ్లలో పది లోపు విద్యార్థులుంటే మూసివేతకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నిరసనలు వ్యక్తమవుతాయన్న భయంతో.. మూసివేతని కాకుండా, ట్యాగ్‌ చేయాలని పై నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాలో 1,447 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 98 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న నెపంతో సుమారు 49 బేసిక్‌, ఫౌండేషన్‌ పాఠశాలలను మూసివేయాలని ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఒక్కో మండలంలో ఆరు నుంచి ఏడు వరకూ ప్రభావం కానున్నాయి. వీటిని ట్యాగ్‌ చేసి ఉంచాలని.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అమలు చేసేయాలని విద్యాశాఖ అధికారులు సూచించినట్లు తెలిసింది.

విద్యార్థులు చదువుకు..

కార్మికులు ఉపాధికి దూరం

ప్రభుత్వ నిర్ణయం వల్ల దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలలు ఉంచడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పిల్లల సంఖ్యను బట్టి రేషనలైజేషన్‌ అనడం తగదని.. ప్రతి ఊరిలోనూ బడి కచ్చితంగా ఉండాలని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల విద్యార్థులు ప్రైవేట్‌ స్కూళ్లకు తరలిపోయే ప్రమాదం ఉంది. బడులతో పాటు.. ఉపాధ్యాయుల సంఖ్య కూడా తగ్గిపోనుంది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండే వంట కార్మికులకు, ఆయాలకు ఉపాధి పోతుంది. ఒక్కో బడిలో ఇద్దరేసి చొప్పున వంట కార్మికులు, ఒక్కొకరు చొప్పున ఆయాలు ప్రభావితం కానున్నారు.

విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న కారణంతో బడులను మూసివేయాలనుకోవడం దారుణం. దీన్ని ఉపాధ్యాయ సంఘాల తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏటా డీఎస్సీ ద్వారా టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తామని ఓ వైపు ప్రభుత్వం చెబుతోంది. ఏ బడినీ మూసివేసేది లేదని హామీ ఇచ్చింది. ఇప్పుడు అందుకు భిన్నంగా బడులను తగ్గించడం వల్ల ఉపాధ్యాయులు తగ్గిపోతారు. పిల్లలు ప్రైవేట్‌ స్కూళ్లకు వెళ్లిపోతారు. మూడు కిలోమీటర్లు దాటి యూపీ, హైస్కూల్‌ ఉంటే పిల్లలకు రవాణా చార్జీలు ఇస్తామని చెప్పారు. అది కూడా అమలు చేయలేదు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే ప్రయత్నాన్ని అడ్డుకుంటాం. తల్లిదండ్రులు, ఎస్‌ఎంసీ కమిటీలతో కలిసి ఆందోళనకు సిద్ధం అవుతాం.

– ఎస్‌. మురళీ మోహనరావు,

యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి

భూములు లాక్కుంటే

ఊరుకునేది లేదు

ఉత్పత్తులు

కొండంత..

ఫౌండేషన్‌, బేసిక్‌ ప్రభుత్వ స్కూళ్లపై వేలాడుతున్న కత్తి

ఐదుగురు కంటే తక్కువ విద్యార్థులున్నారన్న నెపంతో విలీనం

రేషనలైజేషన్‌, ఉపాధ్యాయుల బదిలీల సమయానికి కసరత్తు పూర్తి

ప్రభుత్వ పాఠశాలల మెడపై మూసివేత కత్తి వేలాడుతోంది. ఓవైపు ఏటా డీఎస్సీతో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతూనే.. మరోవైపు విద్యార్థులు లేరన్న నెపంతో సర్కారు బడుల మూసివేతకు రంగం సిద్ధం చేస్తోంది. తద్వారా ఉపాధ్యాయ పోస్టులకూ ఎగనామం పెడుతోంది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే మే, జూన్‌ నెలల్లో రేషనలైజేషన్‌, ఉపాధ్యాయుల బదిలీ సమయానికి పాఠశాలల మూసివేతపై అధికారిక ఉత్తర్వులు విడుదల చేసేలా అడుగులు వేస్తుండడం అటు ఉపాధ్యాయ, ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది.

49

98వేలు 1
1/1

98వేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement