కేంద్ర సాయుధ దళాల్లో ఎంపికై న ఎన్‌సీసీ క్యాడెట్లు
విజయనగరం అర్బన్: సత్య డిగ్రీ కళాశాలకు చెందిన ఎనిమిది మంది ఎన్‌సీసీ క్యాడెట్లు కేంద్ర సాయుధ దళాలైన సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్‌లలో ఉద్యోగాలకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ సాయిదేవమణి తెలిపారు. సీఐఎస్‌ఎఫ్‌లో బి.పూర్ణిమ, స్వాతి, మోహన్, శ్రీను, ఎం.శ్రీను, పి.సాయికుమార్, సీఆర్‌పీఎఫ్‌లో వెంకటేష్, బీఎస్‌ఎఫ్‌లో శ్రవణకుమార్ ఉద్యోగాలకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం కళాశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ డాక్టర్ బొత్స ఝాన్సీలక్ష్మి, కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు, కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు.


