సంతకవిటి: మండలంలోని కొత్తూరు రామచంద్రాపురంలో పునర్నిర్మించిన కాశీ విశ్వేశ్వరాలయం పునఃప్రారంభోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా శాంతి హోమాలు, శిఖర ప్రతిష్ఠ, కళావికర్షణ, పునఃకళాకర్షణ, శాంతి కల్యాణం, విగ్రహ ఆవిష్కరణతో పాటు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం స్వామి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జెడ్పీ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్‌మోహనరావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.


