● వేపాడ పీహెచ్‌సీలో ఫిబ్రవరి నెలలో 28 రోజులకు 1400 మందికి సేవలు అందించాల్సి ఉంది. ఇక్కడ 504 మందికి మాత్రమే వైద్యులు ఓపీ సేవలందించారు. లక్ష్యం ఆమడ దూరంలో ఉండిపోయింది.
● కోరపుకొత్తవలస పీహెచ్‌సీలో ఫిబ్రవరి నెల 28 రోజులకు ఓపీ 1400 నమోదుకావాలి. ఇక్కడ కేవలం 345 ఓపీ నమోదైంది. వైద్యసేవల కోసం ఆస్పత్రికి వచ్చేవారి సంఖ్య అమాంతం పడిపోయింది.
● గంట్యాడ పీహెచ్‌సీలో 1400 మందికి ఓపీ సేవలు అందించాల్సి ఉండగా కేవలం 668 మందికి మాత్రమే అందించారు. ఇక్కడ కూడా లక్ష్యం నెరవేరని పరిస్థితి. ఆస్పత్రికి వస్తే మెరుగైన వైద్యసేవలు అందుతాయోలేదోనన్న బెంగతో అధికమంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నట్టు మండల వాసులు చెబుతున్నారు.
24 గంటలూ సేవలందించాల్సి ఉన్నా...
జిల్లాలో 48 పీహెచ్‌సీలు, 18 పట్టణ పీహెచ్‌సీలు ఉన్నాయి. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మినహా మిగిలిన పీహెచ్‌సీల్లో 24 గంటలపాటు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి. సాధారణ సేవలతో పాటు ప్రసవ సేవలు అందించాలి. ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు స్టాఫ్‌నర్సులు, ఎఫ్‌ఎన్‌ఓ, ఇతర సిబ్బంది సేవలందిస్తారు. కొన్నిచోట్ల నిపుణులైన వైద్యులు ఉన్నా సౌకర్యాలు లేకపోవడం, మరికొన్ని చోట్ల విధులకు సిబ్బంది డుమ్మా కొట్టడం వంటివి వైద్యసేవలపై ప్రభావం చూపుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కొంతమంది వైద్యులు ఆస్పత్రుల నుంచి వెళ్లి పోతున్నారని రోగులు చెబుతున్నారు. రాత్రివేళల్లో కొన్ని పీహెచ్‌సీల్లో ఎఫ్‌ఎన్‌ఓలను ఉంచి వైద్య సిబ్బంది ఇంటికి వెళ్లి పోతున్నారు. దీనివల్ల అత్యవసర వేళ ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
ప్రాథమిక ఆరోగ్య వైద్యకేంద్రాలకు సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విఫలం
ప్రభుత్వ వైద్యంపై సన్నగిల్లుతోన్న నమ్మకం
తగ్గుతున్న ఓపీ నమోదు
అధికమంది ప్రైవేటు ఆస్పత్రులనే
ఆశ్రయిస్తున్న వైనం


