ఐటీడీఏ ఏపీఓ పి.మురళీధర్, డీఆర్‌డీఏ ఏపీడీ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
5న రోడ్లు, భవనాల శాఖామంత్రి పర్యటన
రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఈ నెల 5న జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు మంత్రి పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు.
5న జగ్జీవన్‌రామ్ జయంతి
మాజీ ఉప ప్రధాని, స్వాంత్య్ర సమరయోథుడు డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ 119వ జయంతిని ఈ నెల 5న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్టు కలెక్ట ర్ తెలిపారు. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పార్వతీపురం మెయిన్ రోడ్డులోని సౌందర్య థియేటర్ వద్ద ఉన్న బాబూ జగ్జీవన్‌రామ్ విగ్ర హానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తామన్నారు.
పార్వతీపురం: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, సుస్థిర ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి సూచించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డీఆర్‌డీఏ– వెలుగు అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది కాలంలో సాధించిన లక్ష్యాలు, ఎదురైన సవాళ్లు, క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను విశ్లేషించి తదుపరి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ప్రతీ మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని అక్కడ ఉన్న వ్యాపార అవకాశాలు, ప్రజల నైపుణ్యా లు తదితర అంశాలపై సమగ్ర విశ్లేషణ చేయాలన్నా రు. రుణాల మంజూరు, ఉపాధి కల్పనలో కేవలం మహిళలకే కాకుండా పురుషులకు సైతం అవకాశా లు కల్పిస్తూ సమగ్రమైన డేటాను సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ ఆర్.వైశాలి,


