ముగిసిన పంచాయతీ సర్పంచ్‌ల పదవీకాలం ప్రత్యేక పాలనకు అధికారుల నియామకం ఒక్కో అధికారికి 2 నుంచి 6 పంచాయతీల బాధ్యతలు అదనపు భారం అంటున్న అధికారులు
వీరఘట్టం:
పంచాయతీ సర్పంచ్‌ల పాలన గురువారంతో ముగిసింది. 2021 ఏప్రిల్ 3న ప్రారంభమైన సర్పంచ్‌ల పాలనకు ఐదేళ్లు పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా 451 మంది సర్పంచ్‌లు పదవీ విరమణ పొందారు. దీంతో ఆయా పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ కలెక్టర్ ప్రభాకరరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 15 మండలా ల్లోని 451 పంచాయతీలకు 122 మంది ప్రత్యేకాధికారులను నియమించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొ న్నా రు. అయితే, ఇప్పటికే పనిభారంతో సతమతమవుతుంటే పంచాయతీలకు ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ తమపై అదనపు భారం వేయడం తగదంటూ కొందరు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక పాలనలో ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని భయపడుతున్నారు.
అదనపు భారం
జిల్లాలో ఉన్న 451 పంచాయతీలకు మండల స్థాయిలోని రెవెన్యూ, విద్య, ఐసీడీఎస్, మండల పరిషత్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, హార్టికల్చరల్, వ్యవసాయశాఖలలో పనిచేస్తు న్న 122 మందిని ప్రత్యేకాధికారులుగా నియమించారు. వీరిలో ఒక్కొక్కరికి కనీసం 2 నుంచి అత్యధికంగా 6 పంచాయతీల బాధ్యతలను అప్పగించారు. తమ సొంత శాఖలలోనే పనుల ను సకాంలో పూర్తిచేయలేక సతమతమవుతుంటే పుండుమీద కారం చల్లినట్లు పంచాయతీలకు తమను ప్రత్యేకాధికారులుగా నియమించడం తగదని, ఈ పాలనలో ఇంకా ఎన్ని ఇబ్బందులు పడాలో తెలియడంలేదంటూ కొందరు అధికారు లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
జోరుగా పైరవీలు....
జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుండి ప్రత్యేక
పాలన ప్రారంభం కానుండడంతో తమకు అనుకూలంగా ఉన్న అధికారులను తమ పంచాయతీలకు ప్రత్యేకాధికారులుగా నియమించుకునేందుకు జోరుగా రాజ కీయ పైరవీలు జరిగినట్టు సమాచారం. మండల స్థాయి నుంచి వచ్చిన అధికారుల జాబితాలను జిల్లా కార్యాలయంలో పరిశీలించి రాజకీయ నాయకులు సూచించిన వారికి తమకు అనుకూలంగా ఉన్న పంచాయతీల్లో ప్రత్యేకాధికారులుగా నియ మించారనే ఆరోపణలు ఉన్నాయి.


