నిప్పుల కొలిమి | - | Sakshi
Sakshi News home page

నిప్పుల కొలిమి

Apr 3 2026 8:02 AM | Updated on Apr 3 2026 8:02 AM

నిప్పుల కొలిమి పూతికవలస పొలాల్లో ఏనుగులు హైందవ ధర్మం ఎంతో గొప్పది ● పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కుటుంబీకులు విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు

సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడం.. వేడి గాల్పులు తోడు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలో గురువారం అత్యధికంగా మక్కువ మండలంలో 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన మండలాల్లోనూ 38 నుంచి 39.8 డిగ్రీ ల వరకూ నమోదయ్యింది. ఎండ, గాల్పుల తీవ్రత రానున్న రెండు రోజులూ ఉంటుందని విపత్తుల, వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నా యి. జిల్లాలోని 11 మండలాల్లో శుక్రవారం తీవ్రమైన వడగాలులు ఉంటాయని అంచనా. 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చ ని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారు లు కోరారు.

కురుపాం: మండలంలోని పూతికవలస గ్రామ సమీపంలో గురువారం సాయంత్రం ఏనుగుల గుంపు సంచరించింది. పామాయిల్‌, చెరకు, అరటి, కర్బుజా తోటల్లో ఏనుగులు సంచరిస్తుండడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఏనుగులను కవ్వించవద్దని, అవసరమైతే పొలాలకు రైతులు గుంపుగా వెళ్లాలని అటవీశాఖ అధికారులు తెలిపారు.

పాలకొండ రూరల్‌: సనాతన హైందవ ధర్మం ఎంతో గొప్పదని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 8వ తరం కుటుంబీకుడు వీరభద్రస్వామి అన్నారు. గురువారం రాత్రి పాలకొండ వచ్చిన ఆయన తొలుత ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం కోటదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు లక్ష్మీప్రసాద్‌ శర్మ ఆమ్మవారి చరిత్రను ఆయనకు వివరించారు. అనంతరం కోమటిపేటలో స్వయంభూగా కొలువుదీరిన సనారీ విశ్వేశ్వర అన్నపూర్ణమాంబ స్వామి మఠాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు జరిపారు. వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రబోధించిన కాలజ్ఞాన విశిష్టతను వివరించారు.

యేసు క్రీస్తు త్యాగం విశ్వశాంతికి చిహ్నం

విజయనగరం: యేసు క్రీస్తు ప్రాణత్యాగం విశ్వశాంతికి చిహ్నమని, సర్వ మానవాళి పాప విమో చనం కోసం తన ప్రాణాల ను బలిదానంగా అర్పించి న కరుణామయుడు యేసు అని ఉమ్మడి విజయనగరం జెడ్పీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పేర్కొన్నారు. క్రీస్తు ఆరాధకుల కు గుడ్‌ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు చూపిన త్యాగం, క్షమాగుణం, సహనం, నిస్వార్థ ప్రేమ ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమ ని కొనియాడారు. శత్రువులను సైతం ప్రేమించాలని, పీడిత ప్రజల పట్ల కరుణ చూపాలనే క్రీస్తు బోధించిన సందేశం, ఆచరించిన జీవితం విశ్వమానవాళికి మార్గదర్శకమని పేర్కొన్నా రు. సమాజంలో కూడా అటువంటి శాంతి, సోదరభావం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. క్రీస్తు చూపిన సేవా మార్గంలోనే ప్రస్తుత ప్రభుత్వాలు కూడా నిరుపేదల సంక్షేమంకోసం కృషిచేయాలన్నారు. ప్రజలందరిపైనా క్రీస్తు దీవెనలు ఉండాలన్నారు.

గజపతినగరం: విధుల్లో అలసత్వం వహించిన ఉద్యోగులపై చర్యలు తప్పవని కలెక్టర్‌ ఎస్‌. రాంసుందర్‌రెడ్డి హెచ్చరించారు. గజపతినగరం–2 గ్రామ సచివాలయాన్ని, పురిటి పెంట –1 అంగన్‌వాడీ సెంటర్‌ను ఆయన గురువా రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బందితో మాట్లాడారు. సేవలపై ఆరా తీశా రు. అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్త పి.సత్య వతి విధుల్లో లేకపోవడంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనికి బాధ్యులుగా సీడీపీఓ, సూపర్‌ వైజర్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఐసీడీఎస్‌ పీడీను ఆదేశించారు. అనంతరం చిన్నారులతో ముచ్చటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement