న్యూస్‌రీల్
హడావిడిగా.. ఇష్టారాజ్యంగా పనుల అప్పగింత
బిల్లుల చెల్లింపులోనూ వివక్ష
కావాల్సిన వారికే బిల్లులు
పనుల్లో నాణ్యతకు పాతర
నేతల జేబుల్లోని ‘ఉపాధి’ నిధులు
శుక్రవారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
సాక్షి, పార్వతీపురం మన్యం:
గ్రామాల్లో పంచాయతీ సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసిపోయింది. మరోవైపు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పాత ఉపాధిహామీ పథకం స్థానంలో కొత్త చట్టం (వీబీజీ రామ్‌జీ)రానుందని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు, వాటికి సంబంధించిన బిల్లులు చాలా వరకు పెండింగ్‌లో ఉండిపో యాయి. ఈ నేపథ్యంలో మరోనెల వరకు గడువు పొడిగించారు. పదవీకాలం ముగియడం.. 2025– 26లో చేపట్టిన పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అధిక శాతం పంచాయతీల్లో సర్పంచ్‌లే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తారు. ఇప్పుడు వారిలో ఆందోళన నెలకొంది. ఇదే సమయంలో గోకులం షెడ్లకు బిల్లులు మంజూరయ్యాయి. ఈ షెడ్ల పనులన్నీ దాదాపు టీడీపీకి చెందిన వారే చేయించడం గమనార్హం. ఉపాధి పనులు చేసిన వేతనదారులకు సైతం బకాయిలు రూ.కోట్లలో చెల్లించాల్సి ఉంది.
నిబంధనలకు విరుద్ధంగా పనులు
మరోవైపు ఆర్థిక సంవత్సరం ముగుస్తుందని, చట్టంలో మార్పుల వల్ల నిధులు మురిగిపోతాయన్న ఉద్దేశంతో హడావిడిగా ఉపాధిహామీ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో చేపట్టిన పనులపై పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో జరిగిన ఉపాధి పనుల్లో దాదాపు రూ.120 కోట్ల మేర రహదారుల పనులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని, ప్రజాధనం దుర్వినియోగమైనా పట్టించుకోవడం లేదని సీపీఎం నాయకులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో మంజూరైన ఉపాధిహామీ నిధులతో బీటీ రోడ్లకు సుమారు రూ.70 కోట్లు, సీసీ రహదారులకు సుమారు రూ.50 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనుల్లో నిబంధనలకు విరుద్ధంగా అధికార యంత్రాంగం పనులు చేయించినట్లు ఆరోపణలున్నాయి. టెండర్ ప్రక్రియ ద్వారా జరిపించాల్సి ఉన్నప్పటికీ.. జిల్లా అంతా నామినేషన్ ద్వారా కూటమి ప్రభుత్వం తన అనుయాయులకు కట్టబెట్టింది.
●మక్కువ మండలం వెంకట భైరిపురం నుంచి
తూరుమామిడి వరకు సుమారు రూ.3.60 కోట్లతో బీటీ రోడ్డు మంజూరైతే.. వాటిని ఏడు ముక్కలుగా విడగొట్టి, నామినేషన్ పద్ధతిలో ఇచ్చారు. అర్హత లేని వారికి పనులు అప్పగిస్తుండడంతో పూర్తిస్థాయి లో జరగడం లేదు సరికదా.. నాణ్యత కూడా ఉండడం లేదు.
●జియ్యమ్మవలస మండలంలో టెండర్ ఆధారంగా పనులు జరిపించాలని పట్టుబడితే.. జిల్లా స్థా యి అధికారి ఒకరు కూటమి నాయకులను కూర్చోబెట్టి, పరిష్కారం చేసినట్లు ఆరోపణలొచ్చాయి. మరోవైపు అధికార పార్టీ నాయకులు తమ అనుచరులు ఉన్న గ్రామాలకే కోట్లాది రూపాయల పనులు కేటాయించారు.
●సాలూరు మండలం కూర్మరాజుపేటకు సుమా రు రూ.కోటి వ్యయంతో సీసీ రోడ్డు మంజూరు చేశారు. మక్కువ మండలం కాశీపట్నంకు దాదాపు రూ.1.30 కోట్లు నిధులు మంజూరు చేశారు. పనుల కేటాయింపుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి.


