పారా జాతీయ స్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: జాతీయ స్థాయిలో జరగనున్న పారా అథ్లెటిక్స్ పోటీలకు జిల్లాకు చెందిన క్రీడాకారులు అర్హత సాధించారు. ఇటీవల నెల్లూరులో జరిగిన పారా (దివ్యాంగుల) రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభతో పతకాలు సాధించిన ముగ్గురు క్రీడాకారులు త్వరలో ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్టు జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ శనివారం తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించిన వారిలో కిల్లక లలిత 100, 400, 1500 మీటర్ల పరుగు పోటీల్లో, కొత్తింటి పైడిరాము డిస్కస్ త్రోలో, కరణం గౌతమ్ లాంగ్ జంప్‌లో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచటంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులను అభినందించారు. జాతీయ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయనగరం జిల్లా కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పాలని ఆకాంక్షించారు.
పారా జాతీయ స్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులు
పారా జాతీయ స్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులు


