ఎమ్మెల్యే దౌర్జన్యకాండ | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే దౌర్జన్యకాండ

Feb 6 2026 8:01 AM | Updated on Feb 6 2026 8:01 AM

ఎమ్మె

ఎమ్మెల్యే దౌర్జన్యకాండ

ఎమ్మెల్యే దౌర్జన్యకాండ ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే వరహాలగెడ్డలో ఒకలా.. ఇక్కడ మరోలా!

కోర్టు ఆర్డర్‌ ధిక్కరింపు

జిరాయితీ స్థలంలో నిర్మాణాలను కూల్చివేసిన ఎమ్మెల్యే విజయ్‌చంద్ర

లబోదిబోమంటున్న బాధితులు

సాక్షి, పార్వతీపురం మన్యం:

పార్వతీపురం పట్టణంలో వివాదంలో ఉన్న ఓ జిరాయితీ స్థలం విషయంలో నియోజకవర్గం ఎమ్మెల్యే బోనెల విజయ్‌చంద్ర అత్యుత్సాహం ప్రదర్శించారు. తాను ఎమ్మెల్యేనన్న హోదాను మరిచి.. స్వయంగా రంగంలోకి దిగి, ఆ స్థలంలో యజమానులుగా చెప్పుకునే వ్యక్తులు నిర్మిస్తున్న కట్టడాలను కాలితో తన్ని మరీ కూల్చివేశారు. ఈ విషయంలో స్థానికులను సైతం ఆయన రెచ్చగొట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని వెంకంపేట పంచాయతీ అఫీషియల్‌ కాలనీ సర్వే నంబర్‌ 127/1లో 13 సెంట్ల స్థలాన్ని గ్రంధి వాసు కొనుగోలు చేశారు. తర్వాత ఆ స్థలాన్ని ఆయన మామయ్య మామిడిపాక నారాయణమూర్తికి విక్రయించారు. ఇది జిరాయితీ స్థలమన్న డాక్యుమెంట్లన్నీ వారి వద్ద ఉన్నాయి. ల్యాండ్‌ కన్వర్షన్‌ కూడా జరిగింది. ఈ స్థలంలో గతంలో రెవెన్యూ అధికారులు సర్వే చేసి, హద్దులు కూడా నిర్ణయించి ఇచ్చారు. కొద్దిరోజుల క్రితం స్థలం యజమాని నారాయణ మూర్తి కుటుంబసభ్యులు అక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించగా..స్థానిక ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కాలువ, చప్టాను కూడా ఆక్రమించుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై బాధితులు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ..న్యాయం జరగలేదు. దీంతో వారు అన్ని ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఇంజక్షన్‌ ఆర్డర్‌ తెచ్చుకున్నారు.

ఈ స్థలంలో కట్టడాలను ఎవరు అడ్డుకున్నా శిక్షార్హులు అంటూ బోర్డు సైతం అక్కడ పాతారు. కోర్టు ఆర్డర్‌తో వారి స్థలంలో నిర్మాణాలను ప్రారంభించారు.

దీంతో గురువారం ఉదయం స్వయంగా పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్‌చంద్ర, తన అనుచరులు, స్థానికులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఇక్కడ నిర్మాణాలకు ఎవరు అనుమతిచ్చారంటూ ఆగ్రహంతో ఊగిపోతూ, స్వయంగా ఆయనే కాలితో తంతూ, కట్టడాన్ని కూల్చివేశారు. తన అనుచరులను కూడా రెచ్చగొట్టి, నిర్మాణాలను అడ్డుకున్నారని బాధితులు వాపోతున్నారు.

జిల్లా కేంద్రంలో అనధికార కట్టడాలు, ఆక్రమణలు జోరుగా సాగుతున్నాయి. కొద్దిరోజులుగా పట్టణ నడిబొడ్డున వరహాలగెడ్డ స్థలాన్ని ఆక్రమించుకుని, తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారిపై చర్యలు లేవు. వామపక్ష, ప్రజాసంఘాలు ఆందోళన చేపట్టినా..ఎమ్మెల్యే విజయ్‌చంద్ర అటువైపు చూసి న దాఖలాలు లేవు. జిల్లా కేంద్రంలోనే పలు చెరువుల వద్ద స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. వాటి విషయంలో పట్టించుకోని ఎమ్మెల్యే..ఒక జిరాయితీ స్థలం విషయంలో స్వయంగా తానే రంగంలోకి దిగడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ నిర్మాణాలను అడ్డుకోవాలని పలుమార్లు రెవెన్యూ అధికారులపై ఒత్తిడి కూడా చేసినట్లు తెలుస్తోంది. అన్ని ఆధారాలూ, పత్రాలు వారి వద్ద ఉండడంతో రెవెన్యూ సిబ్బంది కూడా తామేమీ చేయలేమని చే తులెత్తేసినట్లు సమాచారం. దీంతో సహనంనశించి, ఇలా ప్రవర్తించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్యే దౌర్జన్యకాండ1
1/1

ఎమ్మెల్యే దౌర్జన్యకాండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement