గుమ్మిడిగెడ్డపై గుడ్డి నమ్మకం..! | - | Sakshi
Sakshi News home page

గుమ్మిడిగెడ్డపై గుడ్డి నమ్మకం..!

Feb 6 2026 8:01 AM | Updated on Feb 6 2026 8:01 AM

గుమ్మిడిగెడ్డపై గుడ్డి నమ్మకం..!

గుమ్మిడిగెడ్డపై గుడ్డి నమ్మకం..!

గుమ్మిడిగెడ్డపై గుడ్డి నమ్మకం..!

కలగా మారిన మినీ రిజర్వాయర్‌ నిర్మాణం

ఎన్నికల్లో అస్త్రంగా

వినియోగించుకుంటున్న పార్టీలు

మోసపోతున్న రైతులు

కురుపాం: కురుపాం నియోజకవర్గ కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న గుమ్మిడిగెడ్డపై మినీ రిజర్వాయర్‌ నిర్మాణంలో రైతులకు కలగానే మిగిలిపోతోంది. గతంలో రైతులకు రెండు పంటలు సాగు చేసేందుకు గుమ్మిడిగెడ్డ ఉపయోగకరంగా ఉండేది. ఈ గుమ్మిడిగెడ్డ అక్విడెక్టు పైనే సుమారు 20 గ్రామాల రైతులకు చెందిన 5 వేల ఎకరాలకు కుడి, ఎడమ కాలువల గుండా సరఫరా అయ్యే సాగునీటితో భూములు సస్యశ్యామలంగా ఉండేవి. అయితే రానురాను పర్యవేక్షణ లోపం శాపంగా మారడంతో అప్పట్లో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సంబంధిత రైతులంతా గుమ్మిడిగెడ్డ అక్విడెక్టుపై మినీ రిజర్వాయర్‌ నిర్మాణం చేయాలని మొరపెట్టుకోగా అప్పట్లో హా మీ ఇచ్చినా నెరవేరలేదు. తరువాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం కూడా మినీ రిజర్వాయర్‌ నిర్మాణానికి రైతులకు హామీ ఇచ్చింది. అది కూడా బుట్టదాఖలైంది. అదే టీడీపీ ప్రభుత్వం మళ్లీ ప్రస్తుతం అధి కారంలోకి వచ్చే ముందు కూడా గుమ్మిడి గెడ్డపై మినీ రిజర్వాయర్‌ కట్టి తీరుతామని హామీ ఇచ్చింది. ఈ దఫా అయినా గుమ్మిడిగెడ్డపై మినీ రిజర్వాయర్‌ నిర్మాణం జరుగుతుందా..? లేదా ఎన్నికల అస్త్రంలో భాగంగానే మిగిలి పోతుందా..? అని గుమ్మిడిగెడ్డ అక్విడెక్టు పరిధిలో ఉన్న రైతులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

మూడు మండలాలకు మేలు

గుమ్మిడిగెడ్డపై మినీ రిజర్వాయర్‌ నిర్మాణం జరిగితే కురుపాం నియోజకవర్గంలోని కురుపాం, కొమరా డ, జియ్యమ్మవలస మండలాల పరిధిలో ఉన్న శివ్వన్నపేట, గోళ్లవలస, గుజ్జుపాడు, కర్గగండ, పూతికవలస, సీతంపేట, ఈదలవలస, పాలెం, వన్నాం, పులిగుమ్మి, పెద్దవలస, పాతకురుపాం, కిచ్చాడ, కన్నపుదొరవలస తదితర గ్రామాల పరిధిలో ఉన్న ఐదువేల ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా నేటికీ గుమ్మిడిగెడ్డపై మినీరిజర్వాయర్‌ నిర్మాణానికి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ఈ ధపా కూడా ఎన్నికల అస్త్రంగానే గుమ్మిడిగెడ్డను వినియోగించుకున్నారని, గుడ్డినమ్మకంతో రాజకీయ పార్టీల హామీలు నమ్ముతున్నామంటూ రైతులు అసంతృప్తిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement