ఏకలవ్యలో ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

ఏకలవ్యలో ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు

Feb 6 2026 8:01 AM | Updated on Feb 6 2026 8:01 AM

ఏకలవ్

ఏకలవ్యలో ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు

ఏకలవ్యలో ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు నేడు పోలమాంబ ఆలయ హుండీల ఆదాయం లెక్కింపు ప్రతి ఒక్కరూ చదువుపై మక్కువ చూపించాలి ● కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి

సీతంపేట: ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఆరోతరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాలకొండ సబ్‌కలెక్టర్‌, ఐటీడీఏ ఇన్‌చార్జ్‌ పీఓ పవార్‌ స్వప్నిల్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఐటీడీఏ పరిధిలోని భామిని, మెళియాపుట్టి మండలాల్లో ఉన్న ఈఎంఆర్‌ఎస్‌లలో ప్రవేశాలు ఉంటాయన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్‌ ప్రకారం సీట్ల కేటాయింపు జరుగుతుందని, బాలికలకు 60, బాలురుకు 60 మొత్తం 120 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈనెల 28వ తేదీలో గా దరఖాస్తు చేసుకోవాలని వచ్చేనెల 10వ తేదీ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చ ని, ఏప్రిల్‌ 4న ప్రవేశపరీక్ష ఉంటుందని వివరించారు. సీతంపేట బాలికల గురుకుల పాఠశా ల, పెద్దమడి బాలుర పాఠశాలల్లో ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఉంటుందన్నారు.

మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ జాతర మహోత్సవాల్లో భాగంగా ఈ ఏడాది తొలి, మారు జాతరలలో భక్తులు అమ్మవారి చదురుగుడి, వనంగుడిల వద్ద ఏర్పాటు చేసి న హుండీలలో సమర్పించిన కానుకులను శుక్రవారం లెక్కించనున్నట్లు ఈవో బి శ్రీనివా స్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాదా య శాఖ అధికారులు, గ్రామ పెద్దల సమక్షంలో హుండీల ఆదాయం లెక్కింపు చేపట్టనున్న ట్లు ఆలయ ఈవో తెలిపారు. ఆదాయం లెక్కింపు కార్యక్రమంలో ఆసక్తిగల భక్తులు, సేవకులు శుక్రవారం ఉదయం 9 గంటలకు పాల్గొనాలని కోరారు.

మక్కువ: చదువుకు వయసుతో సంబంధం లేదని, ప్రతి ఒక్కరూ చదువుపై మక్కువ చూపించాలని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకర రెడ్ది కోరారు. ఈ మేరకు మక్కువ మండలంలోని పాపయ్యవలస గ్రామంలో అక్షరాస్యత కేంద్రాన్ని కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో నిర్వహిస్తున్న తరగతులను, అభ్యాసకుల హాజరు, బోధనా పద్ధతులను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ అభ్యాసకులతో నేరుగా మాట్లాడి, వారు నేర్చుకుంటున్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. కొందరు అభ్యాసకులతో బోర్డుపై అక్షరాలు, అంకెలు రాయించి వారి ప్రగతిని పరీక్షించారు. ప్రతి ఒక్కరూ కనీస అక్షరాస్యత సాధించేలా కృషి చేయాలని సూచించారు. అక్షరాస్యతకేంద్రంలో విద్యుత్‌ దీపాలు, తాగునీరు, కూర్చునేందుకు అవసరమైన వసతుల ఏర్పాటుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సంబంధిత అధికారులు, వలంటీర్లకు కలెక్టర్‌ పలు సూచనలు చేశారు. గ్రామంలోని నిరక్షరాస్యులందరినీ గుర్తించి, వారంతా కేంద్రానికి వచ్చేలా ప్రోత్సహించాలని కోరారు. కేవలం అక్షరాలే కాకుండా, సెల్‌ఫోన్‌ వాడకం, బ్యాంకు లావాదేవీల వంటి అంశాలపై కూడా ప్రాథమిక అవగాహన కల్పించాలన్నారు. అంకితభావంతో పనిచేస్తున్న వలంటీర్లను అభినందిస్తూ, గైర్హాజరయ్యే అభ్యాసకులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో జా యింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌ కుమార్‌ రెడ్ది, సబ్‌ కలెక్టర్లు ఆర్‌.వైశాలి, పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల స్థాయి అధికారులు, గ్రామసర్పంచ్‌ పాల్గొన్నారు.

లంక దినకర్‌ జిల్లాకు

రాక రేపు

విజయనగరం అర్బన్‌: 20 సూత్రాల ప్రణాళిక చైర్మన్‌ లంక దినకర్‌ శనివారం ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్‌ సమావేశ మందింరలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల అమలు తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు కలెక్టరేట్‌లో పత్రికా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కూటమి నాయకులతో సమావేశమై తిరిగి విశాఖపట్నం బయలుదేరి వెళ్తారని అధికారులు తెలిపారు.

ఏకలవ్యలో ఆరో తరగతిలో  ప్రవేశాలకు దరఖాస్తులు1
1/1

ఏకలవ్యలో ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement