వ్యాన్‌ బోల్తా పడి ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

వ్యాన్‌ బోల్తా పడి ఒకరి మృతి

Feb 6 2026 8:01 AM | Updated on Feb 6 2026 8:01 AM

వ్యాన

వ్యాన్‌ బోల్తా పడి ఒకరి మృతి

● ఇద్దరికి తీవ్రగాయాలు

పాచిపెంట: ఐసీడీఎస్‌ పాల ప్యాకెట్లతో వెళ్తున్న వ్యాన్‌ బోల్తా పడి మండలంలోని గరేళ్ల వలస గ్రామానికి చెందిన గిరిజన యువకుడు మంచాల గణేష్‌(22) గురువారం మృతిచెందాడు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం సాయంత్రం ఐసీడీఎస్‌ పాల ప్యాకెట్లతో వచ్చిన వ్యాన్‌ కేరంగి పంచాయతీ నందేడు వలస అంగన్వాడీ సెంటర్‌లో పాల ప్యాకెట్లు అన్‌లోడ్‌ చేసి శివలింగాపురం అంగన్‌వాడీ సెంటర్‌కు వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కేసలి గ్రామానికి చెందిన కొనిసి వసంతరావు, గరేళ్లవలస గ్రామానికి చెందిన మంచాల గణేష్‌, కొనిసి జమరాజులకు తీవ్ర గాయాలయ్యాయి, వెంటనే వారిని సాలూరు సీహెచ్‌సీకి అక్కడి నుంచి విజయనగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. మంచాల గణేష్‌ పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళంలోని కిమ్స్‌ తరలించగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు, ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లలాం అర్జున్‌ తెలిపారు.

వ్యాన్‌ బోల్తా పడి ఒకరి మృతి1
1/1

వ్యాన్‌ బోల్తా పడి ఒకరి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement