డిజిటల్ మార్కెటింగ్ పై అవగాహన తప్పనిసరి
పార్వతీపురం టౌన్: డిజిటల్ మార్కెటింగ్‌పై అవగాహన తప్పనిసరని డీఆర్‌డీఏ పీడీ సుధారాణి తెలిపారు. శనివారం స్థానిక వెలుగు కార్యాలయంలో డిజిటల్ మార్కెటింగ్ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిజిటల్ మార్కెటింగ్‌కు రిజిష్టర్ అయిన లబ్ధిదారులు, కొత్తగా రిజిస్టర్ చేసుకున్న సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. మహిళల ఆర్థిక అభ్యున్నతికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మహిళలు ఆర్థికంగా బలపడారన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


