నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలి : జేసీ
పార్వతీపురం: పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన వినతులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశమందిరంలో జిల్లా అధికారులు, నోడల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్ధార్‌లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు. అన్నిశాఖల సమన్వయంతో సమస్యలకు నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలని సూచించారు. నోడల్ అధికారులు శాఖల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ కె.హేమలత, ఎస్‌డీసీ ఎస్.దిలీప్ చక్రవర్తితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
వీరఘట్టం: కాయగూరల పంటలకు వీరఘట్టం పట్టణం ఎంతో ప్రసిద్ధి. నిన్నటివరకు ఆకాశాన్నంటిన టమాటో ధర అమాంతం నేడు పతనమైంది. పంట దిగుబడి బాగా వచ్చినప్పటికీ కొనేవారు కరువవడంతో వీరఘట్టంలో పంట పొలాల వద్ద రైతులు టమాటోలను పారబోస్తున్నారు. వీరఘట్టం మార్కెట్‌లో కిలో టమాటో రూ.20 పలుకుతున్నా..పంట పొలాల వద్ద హోల్‌సేల్‌గా కిలో రూ.5కు కూడా కొనేవారు లేరని రైతులు వాపోతున్నారు. మరో వారం రోజుల తర్వాత పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండడంతో టమాటోకు గిరాకీ ఉండవచ్చని రైతులు ఆశిస్తున్నారు.
నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలి : జేసీ


