మన్యంలో ప్రకృతి అందాలు | - | Sakshi
Sakshi News home page

మన్యంలో ప్రకృతి అందాలు

Feb 6 2026 7:11 AM | Updated on Feb 6 2026 7:11 AM

మన్యం

మన్యంలో ప్రకృతి అందాలు

–8లో మన్యంలో ప్రకృతి అందాలు ● పర్యాటకాభివృద్ధికి అపార అవకాశాలు ● రాష్ట్రంలోనే మహాలొద్ద జలపాతానికి గుర్తింపు ● కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి గురువారం శ్రీ 5 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

న్యూస్‌రీల్‌

–8లో
● పర్యాటకాభివృద్ధికి అపార అవకాశాలు ● రాష్ట్రంలోనే మహాలొద్ద జలపాతానికి గుర్తింపు ● కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి

గోల్డెన్‌ అవర్‌లో ధైర్యమే ప్రాణదాత

ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు ప్రాణాన్ని

నిలబెట్టేది..ఆస్తి నష్టాన్ని నివారించేది కేవలం అవగాహన మాత్రమేనని కలెక్టర్‌

డా.ఎన్‌.ప్రభాకర రెడ్డి అన్నారు.

మీటర్‌ రీడర్స్‌కు ‘స్మార్ట్‌’ గుబులు..!

కూటమి ప్రభుత్వం తీరు మీటర్‌ రీడర్స్‌ను

ఆందోళనకు గురిచేస్తోంది. స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుతో ఉపాధికి గండిపడుతోందని

ఆందోళన చెందుతున్నారు.

సాక్షి, పార్వతీపురం మన్యం:

ప్రకృతిని ఆస్వాదించే వారికి మన్యం స్వర్గధామమని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి అన్నారు. జిల్లాలో పర్యాటకాభివృద్ధికి అపార వనరులను ఉన్నాయని చెప్పిన ఆయన.. వచ్చే ఐదేళ్లలో సమూల మార్పులు కనిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అరకు మాదిరి మనవద్దకూ పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డితో కలిసి మాట్లాడారు. అడలి వ్యూపాయింట్‌ వద్ద బాంబో హౌస్‌ ఏర్పాటు చేశామని, మూడు అతిథి గృహాలు కూడా ప్రారంభం కానున్నాయని తెలిపారు. జగతి దగ్గర కూడా మరో వ్యూపాయింట్‌ను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఆగస్టు నుంచి జనవరి వరకు పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయన్నారు.

జిల్లా ఆర్థిక వ్యవస్థకు జలపాతాలే ఊపిరి

పార్వతీపురం మన్యం జిల్లా అంటే ఒకప్పుడు కేవలం కొండలు, కోనలు మాత్రమేనని కలెక్టర్‌ తెలిపారు. నేడు ఆ కొండల మధ్య నుంచి జాలువారే జలపాతాలు జిల్లా ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తున్నాయని చెప్పారు. మరుగునపడిన ప్రకృతి అందాలను వెలుగులోకి తెస్తున్నామని చెప్పారు. స్వల్పకాలంలోనే జిల్లాలోని తాటికొండ, నల్లరాయిగూడ, నీలంవలస, దళాయివలస, అడపరాయి, శిఖపరువు, మెట్టుగూడ, కుశ జలపాతాలను అభివృద్ధి చేసి.. పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. మూడు నెలల కాలంలోనే మూడు లక్షల మంది పర్యాటకులను ఆకర్షించి, జిల్లాను ప్రముఖ పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దినట్లు వివరించారు. ఈ జలపాతాల వద్ద కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం, భద్రతా ఏర్పాట్లు చేయడం, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించడంతో పర్యాటకుల తాకిడి ఊహించని విధంగా పెరిగిందని వివరించారు.

స్థానిక గిరిజనులతోనే అభివృద్ధి

జిల్లాలో సహజసిద్ధంగా ఉన్న జలపాతాల అభివృద్ధికి నిధుల కోసం చూడట్లేదని కలెక్టర్‌ తెలిపారు.

గిరిజన ప్రాంతాల్లోని స్థానికులే మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని, వారే అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. అందువల్లే వారినే గైడ్లుగా, చిరువ్యాపారులుగా చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. వారి శ్రమ వల్లే మారుమూల ప్రాంతాలకు రోడ్లు, రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయన్నారు.

మంత్రముగ్ధులను చేసే లొద్ద జలపాతం..

ప్రకృతి రమణీయతకు నెలవైన మహాలొద్ద జలపాతం రాష్ట్ర పర్యాటకరంగానికే తలమానికంగా నిలవనుందని కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సాలూరు మండలంలోని కొదమ పంచాయతీలో ఈ జలపాతాన్ని గురువారం ప్రారంభిస్తున్నామని చెప్పారు. చుట్టూ కొండలు, సహజ సౌందర్యంతో సుమారు 100 అడుగుల పై నుంచి నీరు పడుతూ, చూపరులను మంత్రముగ్ధులను చేస్తుందని చెప్పారు. జలపాతం వద్ద రెండు

కిలోమీటర్ల దూరం వరకు రహదారిని అభివృద్ధి చేశామని, నేరుగా వాహనాల్లో చేరుకోవచ్చని, అక్కడ నుంచి కాలినడకన వెళ్లాలని తెలిపారు. సాహసాలను ఇష్టపడే వారికి ట్రెక్కింగ్‌కు కూడా అనుకూలమైన ప్రాంతమని వివరించారు. పర్యాటకుల కోసం ఇక్కడ అతిథిగృహం కూడా నిర్మించనున్నామని చెప్పారు.

మన్యంలో ప్రకృతి అందాలు1
1/1

మన్యంలో ప్రకృతి అందాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement