ఐసీడీఎస్ పీడీకి బదిలీ
● శ్రీకాకుళం వికలాంగుల శాఖ ఎ.డిగా నియామకం
విజయనగరం ఫోర్ట్: ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి.విమలారాణికి వికలాంగులు, వయోద్ధులు, ట్రాన్స్‌జెండర్స్‌శాఖ (శ్రీకాకుళం)కు అసిస్టెంట్ డైరెక్టర్ (ఎ.డి)గా బదిలీ అయినట్లు సమాచారం. అయితే బదిలీ ఉత్తర్వులు వచ్చి నెలరోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ఆమె బదిలీ అయిన శాఖలో చేరలేదు. ఐసీడీఎస్ పీడీగానే కొనసాగుతున్నారు. వికలాంగులశాఖకు ఫారిన్ సర్వీస్ కింద డిప్యుటేషన్‌పై బదిలీ చేయాలని ఆమె గతంలో దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. దీంతో అశాఖ ఉన్నతాధికారులు ఆమె అభ్యర్ధనను అమోదిస్తూ వికలాంగుల శాఖకు ఎ.డిగా బదిలీ చేశారు. ఫారిన్ సర్వీస్ కింద బదిలీ కావాలని కోరిన ఆమె ఉత్వర్వులు వచ్చిన తర్వాత వెళ్లక పోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదేవిషయాన్ని ఐసీడీఎస్ పీడీ టి.విమలారాణి వద్ద సాక్షి ప్రస్తావించగా పీడీగా బాధ్యత చేపట్టిన తొలినాళ్లలో ఫారిన్ సర్వీసెస్ కోసం దరఖాస్తు చేసిన మాట వాస్తవమేనన్నారు. అయితే పీడీగా ఇక్కడే కొనసాగాలని ఉన్నతాధికారులు చెప్పినందున కొనసాగుతున్నట్లు తెలిపారు.


