నేడు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రాక | - | Sakshi
Sakshi News home page

నేడు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రాక

Feb 6 2026 7:11 AM | Updated on Feb 6 2026 7:11 AM

నేడు

నేడు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రాక

నేడు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రాక షికారు చేస్తున్న ఏనుగులు వట్టిగెడ్డ ఎడమ కాలువకు గండి ఉద్యోగ బకాయిల చెల్లింపునకు ఏపీజీఈఏ డిమాండ్‌

పార్వతీపురం: రాష్ట్ర పంచాయితీరాజ్‌, గ్రామీ ణాభివృద్ధిశాఖ కమిషనర్‌ ఎం.కృష్ణతేజ గురువారం పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించనున్నట్లు కార్యాలయం వర్గాలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ పర్యటనలో భాగంగా ఉదయం 9 గంటలకు పార్వతీపురం కలెక్టరేట్‌కు చేరుకుని కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గ్రామీణాభివృద్ధి అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం పట్టణంలోని సౌంద ర్య థియేటర్‌ రహదారి పరిధిలో ఉన్న రాయల్‌ కన్వెన్షన్‌ హాల్‌లో పంచాయతీరాజ్‌ అధికారులతో సమీక్షిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పర్యటన ముగిసిన తరువాత విశాఖపట్నం బయలు దేరుతారని వివరించారు.

భామిని: మండలంలో విస్తరించిన వంశధార నదీ తీరం వెంబడి నాలుగు ఏనుగుల గుంపు షికారు కొడుతోంది. బుధవారం భామిని మండలం పసుకుడి తీరానికి ఏనుగుల గుంపు చేరింది. నేరడి–బిల్లుమడ మధ్య తచ్చాడిన ఏనుగులు వంశధార నది ఆవల గల ఒడిశా గ్రామాలైన వన్న–గౌరి గ్రామాల మధ్యకు చేరా యి. అక్కడ సరైన ఆహారం లేక తిరిగి నది దాటి భామిని మండలంలోకి ప్రవేశించాయి. ఏనుగులు తినే పంటలు లేక పచ్చని పంటల ను పాడు చేస్తూ తిరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

జియ్యమ్మవలస రూరల్‌: మండలంలోని రావా డ వట్టిగెడ్డ జలాశయం ఎడమ కాలువకు నీలకంఠాపురం సమీపాన గండిపడింది. వందల ఎకరాలకు సాగునీరందించే కాలువ ప్రతి సంవత్సరం మరమ్మతులకు గురికావడం, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో సొంత నిధులతో మరమ్మతులు చేపడుతున్నామని కాలువ దిగువ రైతులు వాపోతున్నారు. రెండురోజుల క్రితం గండి పడడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు దత్తి కోటేశ్వరరావు, దాసరి శ్రీను, బి.చిన్న, భాస్కరరావు తదితరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ చైర్మన్‌, ఇరిగేషన్‌ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

విజయనగరం అర్బన్‌: ఉద్యోగులు, ఉపాధ్యా యులు, పెన్షనర్ల బకాయిలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీ ఈఏ) డిమాండ్‌ చేసింది. ఇప్పటికే మంజూరైన వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలు దాదాపు రూ.35 వేల కోట్లకు చేరినప్పటికీ, ఇంకా మంజూరు కావాల్సిన బకాయిలు ఉన్నాయని, వాటిని రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపు చేయాలని కోరింది. తమ తరఫున ప్రభుత్వానికి విన్నవించాలని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణకు బుధవారం వినతిపత్రాన్ని అందజేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలను అందజేసే కార్యక్రమాన్ని ఆ సంఘ సభ్యులు చేపట్టారు. ఇందులో భాగంగా బకాయిలను, ఇతర ఆర్థిక అంశాలకు సంబంధించి 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్‌లో తగిన కేటాయింపులు చేయాలని కోరారు. ఈ అంశాన్ని శాసనసభ, శాసన మండలిలో బలంగా ప్రస్తావించి ప్రభు త్వం సానుకూలంగా స్పందించేలా చూడాలని విజ్జప్తి చేశారు. దీనిపై స్పందించిన బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగుల బకాయిలకు సంబంధించి పద్దులవారీగా పూర్తి వివరా లు సేకరించిన అనంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఫైనాన్స్‌బిల్లు వచ్చిన సమయంలో అవసరమైన సందర్భాల్లో ఈ అంశాన్ని సభలో ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో సంఘం జిల్లా అధ్యక్షుడు పువ్వల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి లెంక సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

నేడు పంచాయతీరాజ్‌  కమిషనర్‌ రాక1
1/2

నేడు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రాక

నేడు పంచాయతీరాజ్‌  కమిషనర్‌ రాక2
2/2

నేడు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement