బార్లకు లైసెన్సుల కేటాయింపు
పార్వతీపురం రూరల్: జిల్లాలోని నాలుగు బార్లకు లైసెన్సుల కేటాయింపు ప్రక్రియ గురువారం కలెక్టరేట్‌లో పూర్తయింది. జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత ఆధ్వర్యంలో పారదర్శకంగా లాటరీ నిర్వహించారు. పార్వతీపురం పట్టణంలో మూడు, సాలూరులో ఒక బారు కోసం మొత్తం 20 మంది పోటీపడగా..దరఖాస్తుదారుల సమక్షంలోనే డ్రా తీసి లైసెన్సులు ఖరారు చేశారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఏఎస్పీ ఎ.సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు.
7న జాబ్‌మేళా
విజయనగరం అర్బన్: జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల7న పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐలో జాబ్‌మేళా నిర్వహిస్తామని జిల్లా ఉపాధిఅధికారి ఆర్.వహీదా తెలిపారు. ఫెనెస్ట్రీ విండోస్ అండ్ డోర్స్, టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేటు లిమిటెడ్, ఫ్లిప్‌కార్ట్, యాజాకి ఇండియూ ప్రైవేట్ లిమిటెడ్, ద్వారకా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, జెఫ్టో తదితర ప్రైవేటు సంస్థలు పాల్గొని వివిధ విభాగాల్లో ఉద్యోగనియామకాలు చేపడతాయన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తిగల అభ్యర్థులు ముందుగా ‘ఎంప్లాయిమెంట్.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్‌సైట్‌లో జాబ్ సీకర్ లాగిన్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.
డెంకాడ: మండలంలోని జొన్నాడ పైడితల్లి అమ్మవారి హుండీల ఆదాయాన్ని దేవదాయ శాఖ అధికారులు గురువారం లెక్కించారు. ఈనెల 2 నుంచి 5వ తేదీ వరకు జరిగిన జాతరలో భక్తులు సమర్పించిన కానుకల రూపంలో రూ.7లక్షల 8వేల 473లు వచ్చినట్టు ఈఓ శ్రీనివాస్ తెలిపారు.


