నిఘా నీడలో ఇంటర్ పరీక్షలు
వీరఘట్టం: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిఘా నీడలో నిర్వహిస్తామని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి వై.నాగేశ్వరరావు తెలిపారు. వీరఘట్టం ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఫస్టియర్ విద్యార్థులకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 17 వరకు, సెకెండియర్ విద్యార్థులకు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. దీని కోసం 33 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 17,530 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు వెల్లడించారు. వీరిలో ఫస్టియర్ జనరల్ విద్యార్థులు 5,938 మంది, ఫస్టియర్ ఒకేషన్ విద్యార్థులు 2849 మంది, సెకెండియర్‌లో జనరల్ విద్యార్థులు 6,127 మంది, సెకెండియర్‌లో ఒకేషనల్ విద్యార్థులు 2616 మంది ఉన్నట్లు వివరించారు. గతేడాది 78 శాతం ఉత్తీర్ణత సాధించామన్నారు. ఈసారి ఆ శాతం పెంచేందుకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
44 కేంద్రాల్లో ప్రాక్టికల్స్..
ఇంటర్ ప్రాక్టికల్స్‌ను ఈ ఏడాది 44 కేంద్రాల్లో నిర్వహిస్తున్నాం. జనవరి 27 నుంచి 31 వరకు మొదటి విడత, ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు రెండు విడతలో ప్రయోగ పరీక్షలు జరిగాయి. ప్రస్తుతం మూడో విడతలో ఈ నెల 6 నుంచి 10 వరకు జరుగుతున్నాయి. బోటనీ, జువాలజీ ప్రాక్టికల్స్‌లో 1916 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రాక్టికల్స్‌లో 4,580 మంది విద్యార్థులు హాజరు కానున్నారని డీఐఈఓ నాగేశ్వరరావు తెలిపారు.
ఈ నెల 23 నుంచి 33 కేంద్రాల్లో నిర్వహణ
హాజరు కానున్న 17,530 మంది విద్యార్థులు


