దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి | - | Sakshi
Sakshi News home page

దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి

Feb 7 2026 2:04 PM | Updated on Feb 7 2026 2:04 PM

దేశ వ్యాప్త సమ్మెను  జయప్రదం చేయాలి

దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి

సీతానగరం: జాతీయస్థాయిలో కార్మికులు, ఉద్యోగులు, ప్రజా సంఘాల సబ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించనందుకు నిరసనగా ఫిబ్రవరి 12న జరిగే సమ్మెలో అందరూ భాగస్వాములు కావాలని సీఐటీయూ రాష్ట్రకమిటీ సభ్యురాలు కె.సుబ్బరావమ్మ కోరారు. ఈ మేరకు పార్వతీపురం, సీతానగరం మండలాల్లోని పలుగ్రామాల్లో సీఐటీయూ, వ్యవసాయ కార్మికసంఘాల నాయకులతో కలిసి సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా సీతానగరం మండలంలోని మరిపివలస, చిన్నారాయుడుపేట, సీతానగరం గ్రామాల్లో ప్రచారం చేశారు.

బైక్‌ అదుపుతప్పి తీవ్ర గాయాలు

పార్వతీపురం రూరల్‌: ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లి వస్తుండగా అదుపు తప్పడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుచ్చిమి గ్రామానికి చెందిన గుత్తవల్లి మహేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయమైంది. గమనించిన స్థానికులు మహేష్‌ బంధువులకు సమాచారం ఇచ్చి 108 వాహనంలో పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement