శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
బొండపల్లి: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదోతరగతి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా విద్యాప్రణాళిక అమలుచేస్తున్నామని ఆర్‌జేడీ విజయ్ భాస్కర్ తెలిపారు. బొండపల్లి ఎంఈఓ కార్యాలయాన్ని శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రిజియన్ పరిధిలోని ఆరుజిల్లాల్లోని విద్యార్థులకు గతేడాది డిసెంబర్ 6 నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పదోతరగతి పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నామన్నారు. ఈ ఏడాది విజయనగరం జిల్లా నుంచి 14,744 మంది, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి 5,117 మంది, శ్రీకాకుళం జిల్లా నుంచి 19,370 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు.
● ఆర్‌జేడీ విజయ్‌భాస్కర్


