బైక్ ఢీకొని రైతు దంపతులకు గాయాలు
వీరఘట్టం: మండలంలోని నడిమికెల్ల గ్రామానికి చెందిన వూళ్ల రామారావు ,ప్రమీల దంపతులు తమ పొలంలో పనులు ముగించుకుని ఇంటికి నడిచి వెళుతుండగా రమేష్ అనే వ్యక్తి బైక్‌తో వారిని ఢీకొట్టడంతో వీరికి తీవ్ర గాయాలయ్యాయి. నడిమికెల్ల సీఎస్‌పీ రహదారిపై వెళుతున్న వీరిద్దరినీ మద్యం మత్తులో బైక్‌తో వస్తున్న వ్యక్తి వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. క్షతగాత్రులను వైద్య చికిత్సల కోసం వీరఘట్టం పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం తరలించారు. ఈ ప్రమాదంపై జిల్లా ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్.ఐ షణ్ముఖరావు తెలిపారు.


