పురుడు పోయడమే కాదు.. ప్రాణం నిలుపుతారు! | - | Sakshi
Sakshi News home page

పురుడు పోయడమే కాదు.. ప్రాణం నిలుపుతారు!

Mar 8 2026 7:33 AM | Updated on Mar 8 2026 7:33 AM

పురుడు పోయడమే కాదు.. ప్రాణం నిలుపుతారు! బతుకు బండినే నడిపే వారికి.. రథాలు ఓ లెక్కా?

అమ్మ జన్మనిస్తే.. వైద్యులు ప్రాణం పోస్తారు. వైద్యులుగా, వైద్య సిబ్బందిగా ప్రజలకు సేవ చేయడంలో మహిళల పాత్రను తక్కువ చేయలేం. జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో వైద్యులు 34 మంది, ఏఎన్‌ఎంలు 350, ఎంఎల్‌హెచ్‌పీలు 282, స్టాఫ్‌ నర్సులు 110, ఆశ వర్కర్లు 1,500, హెల్త్‌ సూపర్‌వైజర్‌ 60 మంది చొప్పున పని చేస్తున్నారు. ప్రజారోగ్యంలో కీలక భూమిక పోషిస్తున్నారు.

బతుకు బండినే నడిపే వారికి విమానాలు, రైళ్లు, బస్సులు, ఆటోలు నడపడం ఏ మాత్రం? ఆయా రంగాల్లోనూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారు నేటి ఆధునిక వనితలు. ఇంటి పనులు చూసుకుంటూనే.. క్లిష్టతరమైన కండక్టర్‌ ఉద్యోగాల్లోనూ నెట్టుకొస్తున్నారు. ఆర్టీసీలో జిల్లా వ్యాప్తంగా దాదాపు 90 మంది మహిళా కండక్టర్లు ఉన్నారు. పనిచేసే చోట ఎంతో ఒత్తిడి.. వెకిలి చేష్టలు.. అన్నిటినీ ధైర్యంగానే తట్టుకుని నలబడుతున్నారు మన ధీర వనితలు. ఇవే కాదు.. నేడు అన్ని రంగాల్లోనూ అతివల పాత్ర అమోఘం. కార్మికులుగా, వ్యాపారులుగా.. ఎన్నో.. ఎన్నెన్నో! ఎంతటి కష్టాన్ని అయినా.. పనినైనా చిరునవ్వుతో స్వీకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement