సోమవారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2026

Mar 9 2026 7:38 AM | Updated on Mar 9 2026 7:38 AM

కొండలపైనే ఉంటాం.. కొండకోనల్లో.. జిల్లా స్థాయి క్రీడా పోటీలు నేటి నుంచి కనకదుర్గమ్మ జాతర పూసపాటిరేగ : ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన భోగాపురం కనకదుర్గమ్మ జాతర సోమవారం నుంచి మూడు రోజుల పా టు జరగనుంది. ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కనకదుర్గమ్మ అమ్మవారి జాతర జరపనున్నట్టు నిర్వాహకులు ఆదివారం తెలిపారు. జాతరకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా నుంచే కాక ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు జాతరకు వస్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయం వద్ద దర్శనాని కి లైన్లు ఏర్పాటు చేశారు. భోగాపురం మెయిన్‌వీధి నుంచి ఆలయం వరకు ప్రత్యేకంగా విద్యు త్‌ అలంకరణ ఏర్పాటు చేశారు. మూడు రోజు లూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను కమి టీ సభ్యులు ఏర్పాటు చేశారు. పౌరాణిక, సాంఘిక కార్యక్రమాలతో పాటు ఆఖరి రోజు సంగిడిరాళ్లు పోటీలు నిర్వహించనున్నారు. జాతర కు భోగాపురం సీఐ దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రామనారాయణంలో ద్వాదశ వార్షికోత్సవం రేపు

న్యూస్‌రీల్‌

అటవీ ఫలసాయాల సేకరణకు వెళ్తున్న గిరిజనులు

ఈ సీజన్‌లో కొండలపైనే ఉంటాం. అటవీ ఉత్పత్తులు సేకరించే పనిలో నిమగ్నమౌతాం. ఇంటిళ్లపాది కొండపోడు వ్యవసాయంలో భాగంగా అన్ని రకాల ఉత్పత్తులు సేకరించి ఇంటికి వస్తాం. ఉదయాన్నే వంటలు ముగించుకుని కొండపోడు వద్దకు తీసుకువెళ్తాం. పిల్లాపాపలతో పాటు వెళ్లి అటవీ ఉత్పత్తులు సేకరిస్తాం. సేకరించిన ఉత్పత్తులను సంతల్లో విక్రయించినా.. దళారుల బారిన పడి మోసపోతున్నాం.

– ఎస్‌.జమ్మమ్మ, ఈతమానుగూడ

కొండకోనల్లో వేసవిలో పండిన ఉత్పత్తులు సేకరించడం కష్టమైన పని. గ్రామంలో 90 శాతం మంది కొండపోడు పనుల్లో ఉంటాం. వేసవిలో ఎటువంటి పనులు ఉండకపోవడంతో కొండపోడు పనుల్లో నిమగ్నమౌతాం. గిట్టుబాటు ధరలు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటాయి. అటవీ ఉత్పత్తులను జీసీసీ కొనుగోలు చేస్తే.. బాగుంటుంది. కానీ ఆ పని చేయడం లేదు. దీంతో కొండపోడును నమ్ముకొని పనులు చేస్తున్నా... జీవనం కష్టంగానే ఉంటుంది.

– ఎస్‌. రాజ్‌కుమార్‌, జన్నోడిగూడ

పార్వతీపురం రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌), కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆదివారం పార్వతీపురంలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌ (మాస్టర్స్‌) పోటీలు నిర్వహించారు. స్థానిక ఆఫీసర్స్‌ క్లబ్‌ ఇండోర్‌ స్టేడియం, ప్రకాశం టౌన్‌ క్లబ్‌ వేదికలుగా జరిగిన ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి మొత్తం 68 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో బ్యాడ్మింటన్‌ విభాగంలో 56 మంది, టెన్నిస్‌ విభాగంలో 12 మంది క్రీడాకారులు తమ ప్రతిభను చాటారు. జిల్లా స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి సబ్బవరపు మురళి, వ్యాయామ ఉపాధ్యాయులు ఎం.వాసుదేవరావు నాయుడు, జాకబ్‌ దయానంద్‌, రెడ్డి శివకుమార్‌, డి.శ్రీనివాసరావు తదితరుల ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి డాక్టర్‌ కె.శ్రీధర్‌రావు మాట్లాడుతూ.. ఇక్కడ ఎంపికై న విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించనున్నట్టు తెలిపారు. పోటీల నిర్వహణకు సహకరించిన ఆఫీసర్స్‌ క్లబ్‌, టౌన్‌ క్లబ్‌ నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

విజయనగరం రూరల్‌: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన రామనారాయణంలో ద్వాదశ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించనున్నట్టు ఎన్‌సీఎస్‌ ట్రస్టీ నారాయణం శ్రీనివాస్‌ తెలిపారు. ఈ మేరకు ఆలయ ఆవరణలో కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానప్రతులను ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు చాణిక్య హర్ష, మేనేజర్‌ రమణ, తదితరులు పాల్గొన్నారు.

కొండపోడు

బాటలో

సీతంపేట: వేసవి వచ్చిందంటే చాలు ఎండలో బయటకు వెళ్లాలంటే దిమ్మతిరుగుద్ది. కానీ ఏజెన్సీలోని గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజనులు మాత్రం అడవి బాట పడతారు. అడవుల్లో దొరికే అటవీ ఫలసాయాలు సేకరిస్తారు. వాటిని సంతల్లో విక్రయించడం ద్వారా ఆదాయ మార్గాలు వెదుక్కుంటారు. ఎక్కువగా ఫలసాయాలు ఉత్పత్తి అయ్యే కాలం ఎండకాలమే. మార్చి నుంచి ప్రారంభమయ్యే సీజన్‌ మే వరకు ఉంటుంది. అనంతరం వీరు ఖరీఫ్‌ సీజన్‌లో వరి, ఇతర పంటలు వేసే పనిలో నిమగ్నమౌతారు. ఆరుగాలం శ్రమించి సేకరించే అటవీ ఉత్పత్తులకు, వరి పంటలకు మద్దతు ధరలు ఉంటే పరవాలేదు. లేకపోతే నష్టాలు చవి చూస్తామని గిరిజనులు చెబుతున్నారు.

పొద్దు పొడవక ముందే అడవుల్లోకి...

వేసవి కాలం ప్రారంభమైందంటే పొద్దు పొడవక ముందే గిరిజనులు కొండపోడు పనిలో భాగంగా కొండలపైకి వెళ్తారు. ఎంతో శ్రమకోర్చి చింతపండు సేకరిస్తారు. చింతపండు బొట్లు వలిచి చింతపండును తయారు చేస్తారు. బుట్టలు, కావుళ్లలో వేసి విక్రయానికి సిద్ధం చేస్తారు. ఇప్పుడు కిలో చింతపండు జీసీసీ రూ.36లకు కొనుగోలు చేయగా, బయట వ్యాపారులు కిలో రూ.50పైనే కొనుగోలు చేస్తున్నారు. అలాగే కొండచీపుర్లు పంటను వేస్తారు. కొండచీపుర్లను సేకరించి ఇంటి వద్ద కొద్ది రోజులు ఆరబెట్టి వాటిని చీపుర్లుగా కట్టలు కట్టి విక్రయిస్తారు. కొండచీపురు రూ.30 నుంచి 45 వరకు విక్రయిస్తారు. నరమామిడి తొక్కను సేకరిస్తారు. ఇంటిళ్లపాది నరమామిడి చెక్కను సేకరించి ఇంటివద్ద ఆరబెట్టి ఇదే సీజన్‌లో కిలో రూ.25పైనే అమ్మకాలు జరుపుతారు. నల్లజీడి పిక్కలు కూడా ఎక్కువగా సేకరిస్తారు. పళ్లు కిలో రూ.30 వరకు విక్రయించగా, నల్లజీడి పిక్కలు కిలో రూ.20 లకు గిరిజనులు విక్రయిస్తారు. నులక తాళ్ల నారను సేకరించి నులక మంచానికి ఉపయోగపడే నులక తాళ్లను తయారీ చేస్తారు. ఒక్కో ఉండ రూ.100 నుంచి 150 మధ్య విక్రయిస్తారు. మరికొద్ది రోజుల్లో జీడిపిక్కలు సీజన్‌ ప్రారంభమౌతుంది. ఈ సంవత్సరం పూత బాగా వచ్చింది. పంట దిగుబడి సమయానికి ధరలు బాగుంటే మంచి ఆదాయ వనరులు సమకూరుతాయని, లేదంటే నష్టాల బాట పడతామని గిరిజనులు చెబుతున్నారు.

కొండచీపుర్లు తయారీలో నిమగ్నమైన గిరిజనుడు

టీ 20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో భారత్‌ జట్టు న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. వరల్డ్‌ కప్‌లో మూడుసార్లు విజేతగా నిలిచి జయహో అనిపించుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌ పోరులో భారత్‌ జట్టు క్రికెటర్లు జయహో భారత్‌ అన్న రీతిలో రాణించి వరల్డ్‌ కప్‌ను ముద్దాడారు. దీంతో స్టేడియం జయహో భారత్‌ అంటూ మార్మోగింది. సొంత గడ్డపై నెగ్గిన తొలి జట్టుగా భారత్‌ రికార్డు సృష్టించింది. ఇదిలా ఉండగా ఫైనల్‌ మ్యాచ్‌ను తిలకించేందుకు విజయనగరంలోని రింగురోడ్డులో క్రికెట్‌ అభిమానులు పెద్ద స్క్రీన్‌ ఏర్పాటు చేసి సందడి చేశారు. భారత్‌ విజయంతో బాణసంచా కాల్చి జయహో భారత్‌ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు.

–సాక్షి ఫొటోగ్రాఫర్‌, విజయనగరం

వేసవి ఆరంభం

అటవీ ఉత్పత్తుల సీజన్‌ ప్రారంభం

అడవికి వెళ్తేనే.. పూట గడిసేది..

ఉత్పత్తులకు గిట్టుబాటు కల్పించని జీసీసీ

దళారుల బారిన పడి మోసపోతున్న వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement