కొత్తవలస మండలంలోని
ముసిరాం–
దేవాడ గ్రామాల మధ్యలోని ఉత్తరాంధ్ర కనకదుర్గమ్మ (తోటలో దుర్గమ్మ)
దేవాలయంలో సోమవారం కోటి పసుపు కొమ్ముల నోమును వైభవంగా
నిర్వహించారు. భక్తులు, వివిధ గ్రామాల నుంచి సేకరించిన కోటి పసుపు కొమ్ములను ఆలయంలో రాశిగా పోసి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం లలిత స్తోత్రపారాయణం
నిర్వహించారు. మధ్యాహ్నం భారీఎత్తున
అన్నసమారాధన జరిపారు.
– కొత్తవలస


