● ఫోర్టిఫైడ్ రైస్ తాత్కాలికంగా నిలిపివేత
● జీఓ జారీ చేసిన ప్రభుత్వం
విజయనగరం కలెక్టరేట్: పోషకాలు తక్కువగా ఉండే బియ్యం పేదలు మళ్లీ తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోషకాహార లోపాన్ని అధిగమించడానికి ఇన్నాళ్లు సాధారణ బియ్యంలో కలిపే ఫోర్టిఫైడ్ నిలిపివేయడం ఇందుకు కారణం. ఇది ఒకవైపు పేదలకు నష్టం కలిగిస్తే మిల్లర్లకు కాస్తా మేలు చేస్తుందనడంలో సందేహం లేదు.
ప్రధానమంత్రి గరబీ కళ్యాన్ అన్నయోజన పథకం కింద పేదలకు కోటా ద్వారా సరఫరా చేస్తున్న బియ్యం, విద్యార్థులకు వసతిగృహాల్లో అందిసున్న బియ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న బియ్యానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు విడుదల చేస్తుంది. అందులో అదనంగా కలిపేందుకు కూడా ఫోర్ట్టిఫైడ్ రైస్ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తోంది. పోషకాహారం ఎక్కువగా అందించేందుకు ఈ బియ్యం ఇస్తోంది. క్వింటా బియ్యంలో కేజీ ఫోర్టిఫైడ్ రైస్ కలపడం జరుగుతోంది.
తాత్కాలికంగా నిలిపివేత
ఈ బియ్యం తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీఓ విడుదల చేసింది. వాస్తవానికి ఈ ఏడాది 4.11 మెట్రిక్ టన్నులు ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఈ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. దాదాపు ధాన్యం అన్నీ సేకరణ పూర్తయి మిల్లులకు కూడా తరలించారు. వీటిని మిల్లింగ్ చేసి సుమారు 2.33 లక్షల బియ్యం ఇవ్వాలి. ఇందులో ఇప్పటికి సుమారు 60వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారు. సాధారణ బియ్యంలో కలిపేందుకు తయారు చేసే పోర్టుఫైడ్ రైస్ కెనల్ రాకపోవడం అందుకు సరఫరా రావడం ఇందుకు కారణం. దీంతో మిల్లింగ్ కూడా ఆగింది. కేంద్ర ప్రభుత్వం జీఓతో ఇక ఈ సమస్య లేకపోవడంతో మిల్లింగ్ వేగం పెరిగి ధాన్యం మిల్లింగ్ పెరిగి బియ్యం రానున్నాయి.
పేదలకు ఇబ్బందే..
ఫోర్టిఫైడ్ రైస్ రావడంతో మిల్లింగ్‌కు ఇబ్బందులు తొలిగాయి. దీంతో మిల్లులు వద్ద కుప్పలుగా నిల్వ ఉన్న ధాన్యం మరపట్టి ఇచ్చేందుకు మిల్లర్లుకు సమస్య తీరింది. డిపోలకు వచ్చే నెలకు ఇచ్చేందుకు బియ్యం ఏమి చేయాలన్న అధికారులు సమస్య తీరింది. కానీ పేదలకు నాణ్యమైన రైస్ రావడం కష్టమే. ఫోర్ట్టిఫైడ్ రైస్‌లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సాధారణ బియ్యం వల్ల పోషకాహార లోపం పెరుగుతుంది.
జీఓ వచ్చింది
ఫోర్టిఫైడ్ రైస్ తాత్కాలికంగా నిలిపి వేసినట్టు జీఓ వచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా స్పష్టత రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత మిల్లర్లు నుంచి మరపట్టి మూమూలు బియ్యం తీసుకుంటాం. దీనిపై తదుపరి ఆదేశాలు ఇస్తాం.
– బి.శాంతి, డీఎం, పౌర సరఫరాల సంస్థ


