మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

Mar 2 2026 7:35 AM | Updated on Mar 2 2026 7:35 AM

మహిళల

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

జాతీయ స్థాయి పారా బ్యాడ్మింటన్‌ పోటీలకు జిల్లా క్రీడాకారులు

డీఎస్పీ గోవిందరావు

విజయనగరం క్రైమ్‌: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని స్థానిక మహిళా పోలీస్‌స్టేషన్‌ డీఎస్పీ గోవిందరావు ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా నగరంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. కోట వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ గురజాడ సర్కిల్‌, మూడు లాంతర్ల జంక్షన్‌ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా డీఎస్పీ గోవిందరావు మాట్లాడుతూ.. మహిళా సాధికారత వారోత్సవాలను ఈ నెల 8 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణించాలన్నారు. మహిళలు, బాలల రక్షణకు పోలీస్‌ శాఖ ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఆపద సమయంలో పోలీసుల సహాయం, రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరూ శక్తియాప్‌ను మొబైల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వన్‌ టౌన్‌, టూటౌన్‌ సీఐలు చౌదరి, శ్రీనివాస్‌, ఎస్సైలు శిరీష, లీలావతి, తదితరులు పాల్గొన్నారు.

విజయనగరం: జాతీయ స్థాయి పారా బ్యాడ్మింటన్‌ పోటీలకు జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారని పారా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్‌ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. విజయనగరంలోని రాజీవ్‌ ఇండోర్‌ స్టేడియంలో ఇటీవల జరిగిన 7వ పారా బ్యాడ్మింటన్‌ రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన యాళ్ల సత్తిబాబు (కొత్తవలస ).. ఆరికతోట నాగభూషణరావు (బొబ్బిలి ).. సుంకర లీల (నెల్లిమర్ల ) వివిధ విభాగాల్లో సత్తా చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. మార్చి 6 నుంచి 10 వరకు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు.

ఇన్‌స్పైర్‌ అవార్డులకు

90 ప్రాజెక్ట్‌లు

వీరఘట్టం: జిల్లా వ్యాప్తంగా ఇన్‌స్పైర్‌ అవార్డులకు 90 ప్రాజెక్టులను ఎంపిక చేస్తూ కేంద్ర మానవ వనరులశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లా నుంచి 1120 సైన్స్‌ ప్రాజెక్ట్‌లను పంపించగా వీటిలో 90 ప్రాజెక్ట్‌లను ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. ఎంపికై న ప్రతి ప్రాజెక్ట్‌కు కేంద్రం రూ.10 వేలు మంజూరు చేస్తుందని జిల్లా సైన్స్‌ అధికారి జి. లక్ష్మణరావు తెలిపారు. ఈ 90 ప్రాజెక్ట్‌లను జిల్లా స్థాయిలో ప్రదర్శిస్తే ఇందులో 10 శాతం ప్రాజెక్ట్‌లను రాష్ట్ర స్థాయికి.. అక్కడి నుంచి జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏప్రిల్‌లో విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని ఇన్‌స్పైర్‌ అవార్డులకు వివిధ మండలాల నుంచి ఎంపికై న పాఠశాలల వివరాలు ఇలా ఉన్నాయి.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి 1
1/2

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి 2
2/2

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement