చిన్నారికి సాయం
బలిజిపేట: కిడ్నీ వ్యాధితో బాదపడుతున్న చిన్నారి భారతి కుటుంబానికి సంజీవనాయుడు సేకరించిన మొత్తం రూ.22వేలు వితరణగా అందించారు. ఈ నెల 23వ తేదీన సాక్షి దినపత్రికలో ‘సాయం కోసం చిన్నారి ఎదురుచూపు’ శీర్షికన ప్రచురితమైన కథనంకు స్పందించిన పెదపెంకి గ్రామానికి చెందిన నేతాజీ గ్రంథాలయ వ్యవస్థాపకుడు సంజీవనాయుడు గ్రామస్తుల నుంచి రూ.22,616లు సేకరించారు. ఈ మొత్తాన్ని రేగిడి మండలం సంకిలి గ్రామం వెళ్లి బాధిత చిన్నారి భారతి కుటుంబానికి అందించారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన పెదపెంకి ప్రజలకు సంజీవనాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
చిన్నారికి సాయం


