ఇంటర్ పరీక్ష కేంద్రం పరిశీలన
సీతానగరం: మండలంలోని జోగింపేటలోని ఎస్‌ఓఈ విద్యాలయం, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను కలెక్టర్ ప్రభాకరరెడ్డి శనివారం పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో వసతలపై ఆరా తీశారు. పరీక్షల నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.
గిరిజనదారుల్లో ప్రసవ వేదన
● మార్గంమధ్యలోనే బిడ్డకు జన్మనిచ్చిన గిరిజన మహిళ
కొమరాడ: గిరిజన గ్రామాల గర్భిణులకు సకాలంలో వైద్యసేవలు అందడం లేదు. పురిటి కష్టాలు వీడడం లేదు. రాళ్లదారుల్లోనే నరకయాతన పడుతూ పిల్లలకు జన్మనిస్తున్నారు. దీనికి కొమరాడ మండలంలో శనివారం చోటుచేసుకున్న ఘటనే నిలువెత్తు నిదర్శనం. పూడేసు పంచాయతీ కోన గ్రామానికి చెందిన నిండు గర్భిణి ఆరిక వనితకు తెల్లవారు జామున పురిటినొప్పులు వచ్చాయి. కూనేరు రామభద్రపురం ప్రభుత్వాస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు వెంటనే ఫీడర్ అంబులెన్స్‌కు ఫోన్‌చేసి సమాచారం ఇచ్చారు. అంబులెన్సు చేరుకునేసరికి కాస్త ఆలస్యమైంది. అప్పటికే పురిటినొప్పులు ఎక్కువైనా... ఆస్పత్రికి చేర్చేదారిలేక అంబులెన్స్‌లోనే తరలించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. కప్పలవాడు గ్రామ సమీపంలోకి వచ్చేసరికి నొప్పులు ఎక్కువ కావడంతో స్థానిక మహిళల సాయంతో ప్రసవం జరిపారు. ఆడబిడ్డ జన్మించింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యసేవల కోసం ఇద్దరినీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అంతర్‌వర్సిటీ చెస్ పోటీలకు జీఎంఆర్ ఐటీ విద్యార్థులు
రాజాం సిటీ: తమిళనాడు రాష్ట్రం భారతీదశన్ యూనివర్సిటీలో ఈ నెల 2 నుంచి 5 వరకు జరగనున్న అంతర్ విశ్వవిద్యాలయాల చెస్ పోటీలకు జీఎంఆర్ ఐటీ విద్యార్థులు షణ్ముఖ శ్రీనివాస్, మణికంఠ ఎంపికై నట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్ శనివారం తెలిపారు. ఇటీవల టెక్కలి ఐతమ్ కళాశాలలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చూపారన్నారు. చెస్ జట్టుకు కెప్టెన్‌గా షణ్ముఖ శ్రీనివాస్ బాధ్యతలు నిర్వర్తించనున్నారన్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్‌తో పాటు ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, స్టూడెంట్స్ డీన్ డాక్టర్ వి.రాంబాబు, పీడీ బీహెచ్ అరుణ్‌కుమార్, విద్యార్థులు అభినందించారు.
టీచర్‌కు ఉమెన్ ఆఫ్
ఎక్స్‌లెన్స్ అవార్డు
విజయనగరం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (మార్చి 8వ తేదీ) పురస్కరించుకుని హైదరాబాద్‌లో పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఉత్సవాల్లో అందజేసే ఉమెన్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డుకు విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన సముద్రాల గిరిజా ప్రసన్న ఎంపికయ్యారు. హర్యానా పూర్వ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు కుమార్తె, తెలంగాణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సురభివాణిదేవి, సినీనటి ఆమని తదితరుల చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేయనున్నారు. ఉపాధ్యాయ, సామాజిక రంగంలో చేస్తున్న కృషికి ఆమెను అవార్డుకు ఎంపిక చేశారు.
ఇంటర్ పరీక్ష కేంద్రం పరిశీలన
ఇంటర్ పరీక్ష కేంద్రం పరిశీలన
ఇంటర్ పరీక్ష కేంద్రం పరిశీలన


