ఆక్రమణలను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది | - | Sakshi
Sakshi News home page

ఆక్రమణలను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది

Mar 1 2026 7:37 AM | Updated on Mar 1 2026 7:37 AM

ఆక్రమ

ఆక్రమణలను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది

సీతానగరం: మండలంలోని బగ్గందొరవలస గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. సర్వేనంబర్‌ 1/1లో ఉన్న 15.39 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు పెద్దలు ఆక్రమిస్తున్న వ్యవహారంపై ‘ప్రభుత్వ భూమిపై పెద్దలు కన్ను’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. కబ్జాకు గురైన భూమిని తహసీల్దార్‌ కె.ప్రసన్నకుమార్‌ సూచనల మేరకు ఆర్‌ఐ ఎన్‌.శ్రీనివాసరావు, బగ్గందొరవలస ఇన్‌చార్జి వీఆర్వో, తామరఖండి వీఆర్వోలు పరిశీలించారు. ఆక్రమించిన భూమికి సిమెంట్‌ స్తంబాలతో వేస్తున్న కంచెను అడ్డుకున్నారు. ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే క్రిమినల్‌ చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.

ఆక్రమణలను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది 1
1/1

ఆక్రమణలను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement