డెంకాడ: రబీ సీజన్‌లో ఈ పంట నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి వ్యవసాయ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని పెదతాడివాడలో శుక్రవారం ఆయన పర్యటించి, సాగులో ఉన్న నువ్వు పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉద్యానవన పంటల ద్వారా అధిక ఆదాయం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ డీడీ చిట్టిబాబు, ఏడీఏ నాగభూషణరావు, ఆర్.శ్రీనివాసరావు, ఏఓ సంగీత, ఉద్యానవన అధికారి ఉమాభారతి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి


