నేడు కలెక్టర్‌ పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టర్‌ పర్యటన

Mar 7 2026 7:29 AM | Updated on Mar 7 2026 7:29 AM

నేడు కలెక్టర్‌ పర్యటన పీజీఆర్‌ఎస్‌కు 23 వినతులు పరజపాడు సమీపంలో గజరాజులు వైద్య కళాశాలలో పీజీ అకడమిక్‌సెల్‌ ప్రారంభం

సీతంపేట: మండలంలోని పలు గ్రామాల్లో కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి శనివారం పర్యటించనున్నట్టు ఎంపీడీఓ బిబి.మిశ్రో శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు. పీపీ ఈతమానుగూడ పరిధిలో ఇప్పగూడ గ్రామ ముస్తాబు కార్యక్రమానికి ఉదయం 10 గంటలకు హాజరవుతారన్నారు. అనంతరం జగతపల్లి గ్రామాన్ని కూడా సందర్శించనున్నట్టు తెలిపారు.

సీతంపేట: ఐటీడీఏలో శుక్రవారం నిర్వహించి న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో పాలకొండ సబ్‌కలెక్టర్‌, ఐటీడీఏ ఇన్‌చార్జ్‌ పీఓ పవార్‌ స్వప్నిల్‌ వినతులు స్వీకరించారు. మొత్తం 23 వినతులు వచ్చాయి. అర్హత కలిగిన ఎస్‌జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్‌లుగా పదోన్నతి కల్పించాలని మూలపేటకు చెందిన సింహాచలం కోరారు. జంబాడ పాఠశాలలో సవరభాషా వలంటీర్‌లను నియమించాలని సవర గణేష్‌ తెలిపారు. టెంట్‌హౌస్‌ పెట్టుకోవ డానికి రుణం ఇప్పించాలని చింతలగూడకు చెందిన సుక్కు కోరారు. మర్రిపాడు పంచాయ తీ పరిధిలో వీధిరోడ్లు, కాలువలు నిర్మించాలని సవర మంగయ్య తెలిపారు. పవర్‌ టిల్లర్‌లు ఇప్పించాలని సీహెచ్‌ భారత్‌కుమార్‌ కోరారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

జియ్యమ్మవలస రూరల్‌: మూడు నెలలుగా ప్రశాంతంగా ఉన్న జియ్యమ్మవలస ప్రాంతంలో శుక్రవారం ఏనుగుల గుంపు రాకతో రైతుల లో భయం నెలకొంది. పరజపాడు సమీపంలో గజరాజులు కనిపించడంతో చింతల బెలగాం, సింగనాపురం, పరజపాడు తదితర గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. బొప్పా యి, మొక్కజొన్న తదితర పంటలకు ఏనుగు లు నష్టం కలిగించే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకుని ఏనుగు ల గుంపును తరలించాలని రైతులు కోరుతున్నారు.

విజయనగరం ఫోర్ట్‌: ప్రభుత్వ వైద్య కళాశాల లో పీజీ విద్యార్థుల ప్రవేశాలకు సంబంఽధించి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ అకడమిక్‌ సెల్‌ను ప్రారంభించినట్టు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి.దేవి మాధవి శుక్రవారం తెలిపారు. అకడమిక్‌ సెల్‌ చైర్మన్‌గా డాక్టర్‌ కె.వెంకటాచలం,పోగ్రామ్‌ కోఆర్డినేట ర్‌ గా డాక్టర్‌ కె.శారద,వ్యవహరిస్తారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement