పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి

Mar 5 2026 7:20 AM | Updated on Mar 5 2026 7:20 AM

పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి ● బోర్డు ప్రత్యేక పరిశీలకులు సుబ్రహ్మణ్యం క్షేత్ర స్థాయి పరిశీలన నగదు దొంగిలించిన వ్యక్తి అరెస్టు గిరిజనులపై దౌర్జన్యం తగదు ● ిసీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు

పార్వతీపురం రూరల్‌: జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్మీడియట్‌ పరీక్షలు ముమ్మర తనిఖీ ల నడుమ సాగాయి. బోర్డు ప్రత్యేక పరిశీలకు లు జె.వి.ఎస్‌.ఎస్‌.సుబ్రహ్మణ్యం క్షేత్ర స్థాయి పర్యవేక్షణ చేపట్టారు. ఉదయం 8.15 గంటలకే స్థానిక పార్వతీపురం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ లో భద్రపరిచిన ప్రశ్నపత్రాల కస్టడీ, రికార్డుల ను ఆయన తనిఖీ చేశారు. అనంతరం పార్వతీపురం, సీతానగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలలను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించారు. డీఆర్‌డీసీ లో జరుగుతున్న స్పాట్‌ కోడింగ్‌, సంస్కృత మూల్యాంకన పనులను నిశితంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

96.5 శాతం హాజరు

బుధవారం నాటి పరీక్షకు జిల్లా వ్యాప్తంగా మొ త్తం 6,728 మంది విద్యార్థులకుగాను 6,499 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 229 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు జిల్లా ఇంటర్‌ విద్యా శాఖ అధికారి వై.నాగేశ్వరరావు తెలిపారు.

పార్వతీపురం రూరల్‌: ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిపై దాడి చేసి నగదు దొంగిలించిన నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పార్వతీపురం ఏఎస్పీ మనీషా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామానికి చెందిన పోరాపు తేరేజమ్మ అనే వృద్ధురాలు గత నెల 28న రాత్రి తన ఇంట్లో నిద్రిస్తుండగా, అదే గ్రామానికి చెందిన తామరకండి రాజేష్‌ (26) గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. ఆమె వద్ద ఉన్న నగదును దొంగిలించే క్రమంలో ప్రతిఘటించడంతో, రాయి వంటి వస్తువుతో తలపై కొట్టి గాయపరిచాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న రూ.12,400 నగదుతో పారిపోయాడు. ఈ క్రమంలో బాధితురాలి కుమార్తె పత్తికట్ల తవిటమ్మ ఫిర్యాదు మేరకు పార్వతీపురం రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి ఆదేశాలతో మూడు బృందాలు దర్యాప్తు చేపట్టి, బుధవారం తెల్లవారుజామున నిందితుడిని కృష్ణపల్లిలో అదుపులోకి తీసుకున్నారు. మద్యం, అప్పుల బాధ వల్లే ఈ నేరానికి పాల్పడినట్టు నిందితుడు అంగీకరించాడు. అతని నుంచి రూ.12,400 నగదు, దాడికి వాడిన చేతి కడియం, మోటార్‌ సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో రూరల్‌ సీఐ రంగనాథం, ఎస్సైలు

రాజేష్‌, సింహాచలం పాల్గొన్నారు.

కురుపాం: గిరిజనులు ఆరుగాలం శ్రమించి సాగుచేసిన అటవీ ఉత్పత్తుల రవాణాలో అటవీశాఖ అధికారులు అడ్డంకులు సృష్టిస్తూ లంచాలు వసూలు చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు ఆరోపించారు. కురుపాంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అటవీశాఖ అధికారులు అధికార దుర్వినియోగంతో గిరిజనుల జీవనాధారంపై దెబ్బ కొడుతున్నారని మండిపడ్డారు. వబ్బంగి పంచాయతీలోని తోలుంగూడ గ్రామానికి చెందిన మండంగి రవి, మండంగి సంతోష్‌ కొండచీపుర్లను విక్రయించేందుకు సీతంపేట, కొత్తూరు తరలిస్తుండగా చినబగ్గ కాలనీ కూడలి వద్ద అటవీశాఖ అధికారులు వాహనాన్ని అడ్డగించి రూ.10వేలు వసూలు చేయడం దారుణమన్నారు. పంటను అమ్ముకునే హక్కును కూడా అధికారులు దోచుకుంటురన్నారన్నారు. జీసీసీ అధికారులు స్పందించి మద్దతు ధరకు గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు కోరంగి సీతారాం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement