గడువుకు ముందే జనగణన పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

గడువుకు ముందే జనగణన పూర్తిచేయాలి

Feb 28 2026 7:36 AM | Updated on Feb 28 2026 7:36 AM

గడువు

గడువుకు ముందే జనగణన పూర్తిచేయాలి

గడువుకు ముందే జనగణన పూర్తిచేయాలి ● కలెక్టర్‌ ఎన్‌. ప్రభాకరరెడ్డి ఏఎస్సై కుటుంబానికి రూ.10 లక్షల బీమా మార్చి 2న అంగన్‌వాడీల మహాధర్నా సీఎం పర్యటనకు గట్టి బందోబస్తు

పార్వతీపురం: జిల్లాలో చేపట్టబోయే జనగణన–2027 ప్రక్రియను నిర్ణీత గడువుకు ముందే పూర్తిచేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి మండల అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో మండల స్థాయి అధికారులు, సాంకేతిక సహాయకులకు శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జనగణనపై మూడురోజుల పాటు ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏప్రిల్‌ 16 నుంచి 30 వరకు సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ జరగాలని, దీనికోసం ఏప్రిల్‌ 10వ తేదీలోగా దిగువస్థాయి సిబ్బందికి ఎన్యూమరేషన్‌ పట్ల శిక్షణ ఇవ్వాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ కె.హేమలత, సబ్‌ కలెక్టర్లు ఆర్‌.వైశాలి, పవర్‌ స్వప్నిల్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెన్సెస్‌ ఆపరేషన్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ బీవీఎల్‌ సాయి శేఖర్‌ పాల్గొన్నారు.

పార్వతీపురం రూరల్‌: అనారోగ్యంతో మరణించిన సాలూరు రూరల్‌ అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎస్సై) ఆర్‌.ఆదినారాయణ కుటుంబాని కి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) పోలీ స్‌ శాలరీ ప్యాకేజీ కింద మంజూరైన రూ.10 లక్షల బీమా చెక్కును ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌రెడ్డి తన కార్యాలయంలో అధికారులతో కలిసి శుక్రవారం అందజేశారు. సాలూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తూ ఆదినారాయణ 2025, జూలై 8న అనారోగ్యంతో మృతి చెందారు. ఎస్బీఐ పోలీస్‌ శాలరీ ప్యాకేజీ నిబంధనల ప్రకారం.. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.కోటి, సాధారణ మరణం సంభవిస్తే రూ.10 లక్షల ఆర్థిక సాయం అందుతుందని ఎస్పీ వివరించా రు. ఈ మొత్తాన్ని కుటుంబ అవసరాలకు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించా రు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు, డీఎస్పీ థామస్‌రెడ్డి, ఎస్బీఐ మేనేజర్‌ ఎం.ఆర్‌.దత్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

పార్వతీపురం రూరల్‌: సమస్యల పరిష్కారం కోరుతూ మార్చి 2న విజయవాడలో నిర్వహించనున్న ‘మహాధర్నా’ను జయప్రదం చేయాల ని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూ నియన్‌ పిలుపునిచ్చింది. పార్వతీపురం జిల్లా కలెక్టరేట్‌ వద్ద గత మూడు రోజులుగా చేపట్టిన రిలేనిరాహార దీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా కార్యదర్శి గంట జ్యోతిలక్ష్మి, సీఐటీయూ ఉపాధ్యక్షురాలు వి.ఇందిర మాట్లాడుతూ.. 2019 నుంచి అంగన్‌వాడీలకు వేతనాలు పెరగలేదని, 2023 డిసెంబర్‌లో జరిగిన సమ్మె సంద ర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల్లోనే వేతనాల పెంపుపై నిర్ణ యం తీసుకోవాలని, మిగిలిన మినీ అంగన్‌వా డీ కేంద్రాలను మెయిన్‌ కేంద్రాలుగా మార్చాల ని కోరారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రాట్యుటీ నిబంధనలు రూపొందించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయా లని విన్నవించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజశేఖర్‌, వెంకటరమణ, గౌరమ్మ, సావిత్రి, పార్వతి, సత్యవతి, అంజలి, సూరిబా బు, తదితరులు పాల్గొన్నారు.

విజయనగరం క్రైమ్‌: చీపురుపల్లి మండలం రావివలసలో పింఛన్ల పంపిణీ కోసం సీఎం చంద్రబాబునాయుడు శనివారం రానున్నారు. దీనికోసం 1200 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి శుక్రవారం తెలిపారు. ఏర్పాట్లను ఇన్‌చార్జి ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డితో కలిసి పరిశీలించారు.

గడువుకు ముందే  జనగణన పూర్తిచేయాలి 1
1/2

గడువుకు ముందే జనగణన పూర్తిచేయాలి

గడువుకు ముందే  జనగణన పూర్తిచేయాలి 2
2/2

గడువుకు ముందే జనగణన పూర్తిచేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement