పార్వతీపురం రూరల్ : మతిస్థిమితం లేక మంగళవారం నుంచి అదృశ్యమైన శ్రీపతి మాధవరావు చివరకు విగతజీవిగా లభ్యమయ్యాడు. కుటుంబ సభ్యు ల తెలిపిన వివరాల ప్రకారం.. మాధవరావు మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పట్టణ పోలీసుల కు ఫిర్యాదు చేశారు. గురువారం పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాల సమీపంలో ఉన్న పొదల్లో స్థానికు లు మృతదేహాన్ని గుర్తించి పో లీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరు కున్న పోలీసులు మృతుడు మాధవరావుగా గుర్తించి కు టుంబ సభ్యులకు సమాచా రం చేరవేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


